Home » Tej Pratap yadav
తేజ్ ప్రతాప్ గత నెలలో తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అనుష్క యాదవ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. 12 ఏళ్లుగా తమ మధ్య రిలేషన్ షిప్ ఉందని ప్రకటించారు. ఇంతవరకూ చెప్పడానికి సంకోచించానని, ఇప్పుడు అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
తన గర్ల్‌ఫ్రెండ్ అనుష్క యాదవ్, తానూ పన్నెండేళ్లుగా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, చాలాకాలంగా ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నప్పటికీ అదెలాగో తెలియలేదనీ పేర్కొంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు.
తేజ్ ప్రతాప్ తన పోస్ట్‌లో దురాశాపరులైన జైచంద్ వంటి వారిని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఉంటున్న వారే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తనకు తల్లిదండ్రులే సర్వస్వమని తెలియజేశారు.
రిలేషన్‌షిప్ గురించి అందరికీ తెలిసినా ఆ విషయం దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఐశ్వర్యారాయ్ ఆరోపించారు. తనను కొట్టి, వేధింపులకు పాల్పడినప్పుడు, గృహహింస చేసినప్పుడు లాలూ చెబుతున్న సామాజిక న్యాయం ఎక్కడికి పోయిందని నిలదీశారు.
తేజ్ ప్రతాప్ తన చిరకాల భాగస్వామిగా ఒక యువతిని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడం, ఆయనపై ఇతర వివాదాలు కూడా ఉండటంతో లాలూ తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ శనివారంనాడు తన ఫేస్‌బుక్ పేజ్‌లో అనుష్కతో తనకు చిరకాలంగా ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.
తేజ్ ప్రతాప్ తన నివాసంలో శనివారంనాడు హోలీ వేడుకలు నిర్వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. వేదికపై కూర్చున్న తేజ్ ప్రతాప్ మైక్ పట్టుకుని కానిస్టేబుల్ దీపక్‌కుమార్‌ను డాన్స్ చేయాల్సిందిగా ఆదేశించారు.
హోలీ సెలబ్రేషన్స్ లో ఒక పోలీసును డాన్స్ చేయమని తేజ్‌ప్రతాప్ హుకుం జారీ చేసి, ఆయనను బెదిరించినట్టు వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ మండిపడింది.
లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమ యాదవ్, తదితరులకు రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో సమన్లు జారీ కావడంతో ఇరువురూ కోర్టుకు హాజరయ్యారు.
ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ఓవైపు సమావేశానికి సన్నాహకాలు జరుగుతుండగా, లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చర్చనీయాంశంగా మారింది.