Share News

Tej Pratap: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. తేజ్ ప్రతాప్ యాదవ్

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:21 PM

తన గర్ల్‌ఫ్రెండ్ అనుష్క యాదవ్‌, తానూ పన్నెండేళ్లుగా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, చాలాకాలంగా ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నప్పటికీ అదెలాగో తెలియలేదనీ పేర్కొంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఇటీవల ఒక పోస్ట్‌ పెట్టారు.

Tej Pratap: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. తేజ్ ప్రతాప్ యాదవ్
Tej Pratap Yadav

పాట్నా: తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు భద్రత పెంచాలని లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. పార్టీకి చెందిన నలుగురైదుగురు నేతల కుట్ర కారణంగానే పార్టీ (RJD) నుంచి తాను బహిష్కరణకు గురైనట్టు ఆరోపించారు.


తన గర్ల్‌ఫ్రెండ్ అనుష్క యాదవ్‌, తానూ పన్నెండేళ్లుగా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, చాలాకాలంగా ఈ విషయాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నప్పటికీ అదెలాగో తెలియలేదనీ పేర్కొంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఇటీవల ఒక పోస్ట్‌ పెట్టారు. అయితే అప్పటికే తేజ్‌ప్రతాప్ వివాహం 2018లో బీహార్ మాజీ మంత్రి చందిక్రా రాయ్‌తో జరగడం, కొద్దిరోజుల్లోనే విభేదాలు పొడచూపి విడాకుల వరకూ వెళ్లడంతో ఆయన పోస్ట్ సంచలనమైంది. ఈ క్రమంలో క్రమశిక్షణ పేరుతో తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు లాలూ ప్రసాద్ యాదవ్ సస్పెండ్ చేశారు. అయితే ఆ వెంటనే తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని తేజ్ ప్రతాప్ వివరణ ఇచ్చారు. ఎడిట్ చేసిన ఫోటోను పోస్ట్ చేశారని చెప్పారు. ఆర్జేడీలోని కొందరు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తాజాగా అదే వాదనను ఆయన మరోసారి వినిపించారు.


బీహార్ ప్రజలకు తానేంటో బాగా తెలుసునని, నలుగురైదుగురు పన్నిన కుట్రకు తాను బలైన విషయాన్ని వారు గ్రహించారని తేజ్ ప్రతాప్ తెలిపారు. తనను ఒంటరిని చేయడం ద్వారా అణిచివేయాలని అనుకున్నారని, దీనిపై తాను ప్రజల్లోకి వెళ్తానని, వాళ్లే తనకు న్యాయం చేస్తారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సంకేతాలిచ్చారు. ఆర్జేడీ నుంచి తన బహిష్కరణకు కారణమైన వారి పేర్లు వెల్లడిస్తానని, తన వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకున్న వారిపై కోర్టుకు వెళ్తానని తేజ్ ప్రతాప్ చెప్పారు. వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే ఎవరూ సహించలేరని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున భద్రత పెంచాలని బీహార్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.


నా సోదరుడు సీఎం కావాలి

తల్లిదండ్రుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని తేజ్ ప్రతాప్ ఈ సందర్భంగా చెప్పారు. ఒక పెద్ద సోదరుడుగా తన తమ్ముడు తేజస్వి ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ తాను కోరుకుంటూనే ఉంటానని, అందుకు అవసరమైన సపోర్ట్ కూడా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు

6 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

For National News And Telugu News

Updated Date - Jun 23 , 2025 | 04:27 PM