Tej Pratap: అనుష్కను కలుసుకున్న తేజ్ ప్రతాప్.. తనను ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్య
ABN , Publish Date - Jun 30 , 2025 | 08:51 PM
తేజ్ ప్రతాప్ గత నెలలో తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అనుష్క యాదవ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. 12 ఏళ్లుగా తమ మధ్య రిలేషన్ షిప్ ఉందని ప్రకటించారు. ఇంతవరకూ చెప్పడానికి సంకోచించానని, ఇప్పుడు అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

పాట్నా: ఒకవైపు సొంత కుటుంబ నుంచి, మరోవైపు రాజకీయంగానూ సమస్యలను ఎదుర్కొంటున్న ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) మరోసారి వార్తల్లో నిలిచారు. తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఇటీవల ప్రకటించుకున్న అనుష్క యాదవ్‌ను ఆయన సోమవారంనాడు కలుసుకున్నారు. సుమారు 5 గంటల సేపు ఆమెతో సమావేశమయ్యారు.
'ఫ్యామిలీ రిలేషన్స్‌ను మేము షేర్ చేసుకున్నాం. ఆ కారణంగానే ఆమెను (అనుష్క యాదవ్) కలుసుకునేందుకు వచ్చాను. అఫ్‌కోర్స్...నేను ఎక్కడికైనా వెళ్తాను. ఎవరూ నన్ను ఆపలేరు. అందరితోనూ నేను కాంటాక్ట్‌లో ఉన్నాను' అని మీడియాతో మాట్లాడుతూ తేజ్ ప్రతాప్ చెప్పారు.
వివాదం ఇలా..
తేజ్ ప్రతాప్ గత నెలలో తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో అనుష్క యాదవ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. 12 ఏళ్లుగా తమ మధ్య రిలేషన్ షిప్ ఉందని ప్రకటించారు. ఇంతవరకూ చెప్పడానికి సంకోచించానని, ఇప్పుడు అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అయితే, 2018లోనే తేజ్‌ప్రతాప్‌కు వివాహం కావడంతో ఇది బీహార్‌లో సంచలనమైంది. అసెంబ్లీ ఎన్నికల సంవత్సరం కూడా కావడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కుటుంబం నుంచే కాకుండా పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. దీనిపై తొలుత తేజ్ ప్రతాప్ వివరణ ఇస్తూ, తన ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, ఫోటోను ఎడిట్ చేశారని తెలిపారు. ఆర్జేడీలోని కొందరు తనపై కుట్ర పన్నారని, ఇలాంటి కుట్రదారుల పట్ల ఆర్జేడీ అధినాయకత్వం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తన రాజకీయ పాత్రను ప్రజలే నిర్ణయిస్తారని, ప్రజల వద్దకే వెళ్తానని, బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
ప్లాన్ ప్రకారమే లా విద్యార్థినిపై అత్యాచారం.. వెలుగులోకి కొత్త విషయాలు
లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
For National News And Telugu News