Share News

Lalu Expels Tej Pratap: ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ బహిష్కరణ.. లాలూ సంచలన నిర్ణయం

ABN , Publish Date - May 25 , 2025 | 04:44 PM

తేజ్ ప్రతాప్ తన చిరకాల భాగస్వామిగా ఒక యువతిని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడం, ఆయనపై ఇతర వివాదాలు కూడా ఉండటంతో లాలూ తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

Lalu Expels Tej Pratap: ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ బహిష్కరణ.. లాలూ సంచలన నిర్ణయం

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (RJD)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ సుప్రీం లాలూ ప్రసాద్ ప్రసాద్ (Lalu Prasad Yadav) తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్‌ (Tej Pratap)ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. పార్టీతో పాటు కుటుంబం నుంచి కూడా ఆరేళ్ల పాటు తేజ్‌ప్రతాప్‌ను బహిష్కరిస్తున్నట్టు లాలూ ఆదివారంనాడు ప్రకటించారు. తేజ్ ప్రతాప్ తన చిరకాల భాగస్వామిగా ఒక యువతిని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడంతో లాలూ తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. లాలూ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో తేజ్‌ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత నైతికత, ప్రజల పట్ల ఉన్న బాధ్యతను పదేపదే తేజ్‌ప్రతాప్ అతిక్రమిస్తున్నట్టు లాలూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Viral Photo: రాహుల్‌తో జ్యోతి మల్హోత్రా ఫోటో వెనుక నిజం ఏమిటంటే..


''వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను నిర్లక్ష్యం చేస్తే సామాజిక న్యాయం కోసం జరుపుతున్న మన సమష్టి పోరాటం బలహీనమవుతుంది'' అని లాలూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఏ విలువలు, సంప్రదాయాలను పార్టీ, కుటుంబం అనుసరిస్తోందో దానికి అనుగుణంగా తన పెద్ద కుమారుడి ప్రవర్తన లేదని అన్నారు. ఆకారణంగా పార్టీ నుంచి తొలగించడంతో పాటు కుటుంబం నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకునట్టు ప్రకటించారు. ఇక నుంచి పార్టీ వ్యవహరాల్లో, కుటుంబ వ్యవహరాల్లో తేజ్ ప్రతాప్‌కు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. తేజ్ ప్రతాప్‌ తన వ్యక్తిగత వ్యవహారాలను స్వతంత్రంగానే చక్కబెట్టుకోగడని, ఆయనతో సంబంధాలు పెట్టుకోవాలనుకునే వారు స్వీయ విచక్షణతో వ్యవహరించాలని లాలూ సూచించారు.


వివాదం ఏమిటి?

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తేజ్‌ప్రతాప్ యాదవ్ శనివారంనాడు ఫేస్‌బుక్‌లో అనుష్క యాదవ్ అనే అమ్మాయితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. తమ ఇద్దరి మధ్య 12 ఏళ్లుగా రిలేషన్‌షిప్ ఉందని, ఇంతకాలం ఈ విషయం చెప్పాలనుకున్నా ఎలా చెప్పాలో తెలియలేదని, ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని అందులో పేర్కొన్నారు. అయితే, తేజ్‌ప్రతాప్‌కు ఇప్పటికే వివాహం కావడంతో ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనుమరాలినే తేజ్‌ప్రతాప్ పెళ్లి చేసుకున్నారు. అయితే గృహహింస, కుటుంబ కలహాల కారణంగా వీరి వివాహబంధం విచ్ఛిన్నమైంది. కాగా, అనుష్క యాదవ్‌తో ఫోటోపై విమర్శలు వెల్లువెత్తడంతో తేజ్‌ప్రతాప్ వెంటనే ఒక ప్రకటన చేశారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని, తనను, తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరిగిందని చెప్పారు. అయితే హ్యాకింగ్ వ్యవహారంపై ఆయన ఫిర్యాదు చేశారా అనేది వెంటనే తెలియలేదు.


ఇవి కూడా చదవండి..

NDA CMs, Deputy CMs Meet: ఆపరేషన్ సింధూర్‌ విజయంపై మోదీని అభినందిస్తూ తీర్మానం

Mann ki Baat: తెలంగాణ డ్రోన్ దీదీలపై ప్రధాని మోదీ ప్రశంసలు

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

For National News And Telugu News

Updated Date - May 25 , 2025 | 04:47 PM