Tej Pratap Yadav: నా ప్రాణానికి ముప్పు ఉంది
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:03 PM
తేజ్ ప్రతాప్ యాదవ్ గత మేలో ఒక మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించడంతో ఆర్జేడీలో కలకలం రేగింది. దీంతో ఆయనను పార్టీ నుంచి ఆర్జేడీ బహిష్కరించింది.
పాట్నా: జనశక్తి జనతాదళ్ (JJD) వ్యవస్థాపకుడు, లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తన ప్రాణాలకు ముప్పు ఉందని, శత్రువులు తనను చంపవచ్చని ఆదివారంనాడు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ శత్రువులు ఎవరనేది ఆయన వెల్లడించలేదు. దీనికి ముందు కూడా తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయనకు కేంద్ర హోం శాఖ వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది.
'నా భద్రతను పెంచారు. నాకు ముప్పు ఉంది. నా శత్రువులు చంపినా చంపవచ్చు. ప్రతి ఒక్కరూ శత్రువులాగానే కనిపిస్తున్నారు' అని ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన అన్నారు. నవంబర్ 2న కూడా ఇదే రకమైన ఆందోళనను ఆయన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రస్తావిస్తూ, తన భద్రతను పెంచాలని ప్రధానమంత్రి నంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
తేజస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలు
తన తమ్ముడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 36వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తేజ్ ప్రతాప్ శుభాకాంక్షలు తెలిపారు. తేజస్వికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. తేజ్ గత మేలో ఒక మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు 'ఫేస్‌బుక్' పోస్టులో వెల్లడించడంతో ఆర్జేడీలో కలకలం రేగింది. దీంతో ఆయనను పార్టీ నుంచి ఆర్జేడీ బహిష్కరించింది. తన ఫేస్‌బుక్ హ్యాక్ అయినట్టు ఆ తర్వాత తేజ్ వివరణ ఇచ్చారు. తన కుటుంబలో తలెత్తిన సంక్షేమానికి పార్టీలోని విద్రోహులే కారణమని ఆరోపించారు. ఈ ఏడాది బిహార్ ఎన్నికలకు ముందు తేజ్ సొంతంగా జేజేడీ పార్టీని ఏర్పాటు చేసి మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటకలో నాయకత్వ పోరుపై బీజేపీ పేరడీ వీడియో
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి