Share News

Gujarath ATS: గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:03 PM

దేశంలో మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక టీమ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది.

Gujarath ATS: గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్

దేశంలో మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్. సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ వివిధ ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసింది. గుజరాత్ ఏటీఎస్ గతంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న అనేక ఉగ్రవాద మాడ్యూళ్లను ఛేదిందింది. తాజా అరెస్ట్‌ కూడా ఉగ్రవాద ఏరివేతలో ఓ పెద్ద విజయమని భావించింది.


అదుపులోకి తీసుకున్నవారిపై ఏడాది కాలంగా అధికార బృందాలు నిఘావేసి ఉంచినట్టు ఏటీఎస్ వెల్లడించింది. వారికి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ISIS)తో సంబంధముందని పేర్కొంది. నిందితులు దేశంలో ఏదో పెద్ద ఉగ్రకుట్రకే పన్నాగం పన్నినట్లు చెప్పిన ఏటీఎస్.. అందుకోసం వారు ఇటీవల ఆయుధాల మార్పిడి కోసం గుజరాత్‌లో సంచరించినట్టు తెలిపింది. ముగ్గురిలో.. ఇద్దరు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌(UP)కు చెందిన వారు కాగా, మరొకరు హైదరాబాద్(Hyderabad) వాసిగా ఏటీఎస్ గుర్తించింది. ఈ ముగ్గురూ ఉగ్రవాదంపై ప్రత్యేక శిక్షణ పొందారని, వారి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని తేల్చింది. వీరంతా రెండు వేర్వేరు సంస్థల ఉగ్ర మాడ్యూళ్లలో భాగమని తెలిపింది.


నిందితులపై విచారణ చేపట్టినట్టు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. వీరితో ఇంకెవరికైనా సంబంధాలున్నాయా, వారి ప్రణాళికలేంటి అనే విషయాలు బయటపడే అవకాశమున్నట్టు తెలిపారు. ఈ విషయమై త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు అధికారులు.


గతంలోనూ..

2024 జులైలో అల్‌ఖైదా(Al-Qaeda)తో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అరెస్టైన వారిలో.. ఇద్దరు గుజరాత్ వాసులు కాగా, మరో ఇద్దరు ఢిల్లీ, నొయిడా ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వారికి అల్‌ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్ మాడ్యూల్‌తో సంబంధమున్నట్టు తేల్చింది.


ఇవి కూడా చదవండి..

మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..


పక్షులు ఈమెతో మాట్లాడుతున్నాయ్.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో..


మరిన్ని
ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 09 , 2025 | 01:30 PM