Home » Gujarat
గుండెపోటు.. ఇతర కారణాల వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి కుప్పకూలిపోయిన వారికి సీపీఆర్ చేసి స్పృహలోకి తీసుకువస్తుంటారు. మనిషికి మాత్రమే కాదు.. ఆపదలో ఉన్న ఓ కొండచిలువకూ సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఘటన నెట్టింట వైరల్ గా మారింది.
ఉల్లిపాయ.. దంపతుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఇది.. ఒకరికి ఇష్టంగా, మరొకరికి అయిష్టంగా మారి.. ఏకంగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారి వైవాహిక జీవితానికి చెక్ పెట్టింది. అసలేమైందంటే...
ప్రపంచ స్థాయి భవనాలు, అత్యాధునిక సాంకేతికతలు, మెరుగైన మౌలిక వసతులతో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)ని ప్రపంచ వ్యాపారం కోసం అత్యాధునిక హుంగులతో నిర్మించారు.
కరెంట్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాముకు స్నేక్ రెస్క్యూయర్ సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. ఇందుకోసం ఏకంగా అరగంట పాటు ఎంతో కష్టపడ్డాడు. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రజలతో మమేకమయ్యారు. వల్సాడ్ వరకూ వందేభారత్ రైలులో ప్రయాణించారు. అనేక మందిని మర్యాదపూర్వకంగా పలుకరించారు. రాష్ట్రంలో రైలు ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించే సంకేతమిచ్చారు.
ఇంటి ఆవరణలో తన తల్లితో కలిసి రెండేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. వీరిపై ఉన్నఫళంగా ఒక సింహం దాడి చేసింది. చిన్నారిని నోట కరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. ఒక కిలో మీటర్ దూరంలో అటవీ అధికారులు విగత జీవిగా పడి ఉన్న చిన్నారిని గుర్తించారు.
గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో వరుడు వధువును రాడ్డుతో కొట్టి పొట్టన పెట్టుకున్నాడు. ఏడాదిన్నరగా ఆ యువ జంట సహజీవనంలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై పరోక్షంగా మోదీ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ఒక నేత ప్రకటించారని, అయితే ప్రజలు వారి విభజన రాజకీయాలను పూర్తిగా తోసిపుచ్చారని చెప్పారు.
టెర్రరిస్ట్ సయ్యద్ నివాసంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సయ్యద్ సోదరుడికి నోటీసులు ఇచ్చి మరీ పోలీసులు సోదాలు చేపట్టారు.
దేశంలో మరో ఉగ్రకుట్ర భగ్నమైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుజరాత్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక టీమ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది.