Share News

Gujarat Shocker: వధువును రాడ్డుతో కొట్టి చంపిన వరుడు.. పెళ్లికి గంట ముందు దారుణం

ABN , Publish Date - Nov 16 , 2025 | 03:21 PM

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో శనివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డబ్బు విషయంలో వివాదం తలెత్తడంతో వరుడు వధువును రాడ్డుతో కొట్టి పొట్టన పెట్టుకున్నాడు. ఏడాదిన్నరగా ఆ యువ జంట సహజీవనంలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Gujarat Shocker: వధువును రాడ్డుతో కొట్టి చంపిన వరుడు.. పెళ్లికి గంట ముందు దారుణం
Gujarat bride murder

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి సరిగ్గా గంట ముందు వరుడు వధువును దారుణంగా హత్య చేశాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన తగాదా ఈ హత్యకు దారి తీసింది (Gujarat Bhavnagar Incident).

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం భావ్‌నగర్‌లో ఈ దారుణం జరిగింది. సోనీ హిమ్మత్ రాథోడ్, సాజన్ భరయ్యా ఏడాదిన్నరగా సహజీవనంలో ఉన్నారు. ఇటీవలే వారి నిశ్చితార్థం జరిగింది. శనివారం వారి పెళ్లి జరగాల్సి ఉంది.

ఈ క్రమంలో వధూవరుల మధ్య ఓ చీర, డబ్బు గురించి గొడవ మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన సాజన్ విచక్షణ కోల్పోయి సోనీని ఇనుప రాడ్డుతో కొట్టాడు. అక్కడితో ఆగక ఆమె తలను గోడకేసి కొట్టడంతో తీవ్రగాయాలపాలైన ఆమె కన్నుమూసింది. ఆ తరువాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. చీర, డబ్బు విషయమై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఈ హత్యకు దారి తీసిందని డీఎస్పీ తెలిపారు. అతడి దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని తెలిపారు. దర్యాప్తు అనంతరం తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఈ హత్యకు మునుపు నిందితుడు అదే రోజున తన పొరుగింటి వ్యక్తితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అతడిపై పోలీసు కేసు కూడా నమోదైంది. సోనీ హత్య నేపథ్యంలో సాజన్‌పై పోలీసులు మర్డర్ కేసు కూడా పెట్టారు. ఇక ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది.


ఇవి కూడా చదవండి:

వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్

బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 16 , 2025 | 03:26 PM