Gujarat CM: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రైలు ప్రయాణం
ABN , Publish Date - Nov 27 , 2025 | 02:07 PM
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ ప్రజలతో మమేకమయ్యారు. వల్సాడ్ వరకూ వందేభారత్ రైలులో ప్రయాణించారు. అనేక మందిని మర్యాదపూర్వకంగా పలుకరించారు. రాష్ట్రంలో రైలు ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించే సంకేతమిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇవాళ వందే భారత్ రైలులో ప్రయాణించారు. గాంధీనగర్ నుంచి వల్సాడ్ కు ఆయన టీం గుజరాత్ కలిసి రైలులో వెళ్లారు. 'సామూహిక ఆలోచనలతో గుజరాత్ అభివృద్ధి' అంశంపై దృష్టి సారించిన పటేల్ ప్రభుత్వం.. వల్సాడ్‌లో ఇవాళ్టి నుంచి 12వ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. 'కలెక్టివ్ థింకింగ్ టు కలెక్టివ్ డెవలప్‌మెంట్' అనే థీమ్‌తో ఈ సమ్మిట్ వల్సాడ్‌లో ఈ ఉదయం ప్రారంభమైంది.
ఈ శిబిర్ రాష్ట్ర భవిష్యత్ విధానాలకు మార్గదర్శకంగా ఉంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వందే భారత్ రైలులో సీఎం ప్రయాణం, రాష్ట్రంలో రైలు ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించే సంకేతంగా కూడా చెబుతున్నారు. గత చింతన్ శిబిర్‌లు గుజరాత్‌లో పర్యాటకం, పరిశ్రమలు, వ్యవసాయ విధానాల్లో ముఖ్య పాత్ర పోషించాయి. ఈ 12వ శిబిర్‌లో కూడా రాష్ట్రంలో ఆర్థిక పునరుద్ధరణ, డిజిటల్ గుజరాత్, మహిళల సాధికారత వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News