Gujarat ATS Raids: టెర్రరిస్ట్ సయ్యద్ నివాసంలో గుజరాత్ పోలీసుల సోదాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:23 AM
టెర్రరిస్ట్ సయ్యద్ నివాసంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సయ్యద్ సోదరుడికి నోటీసులు ఇచ్చి మరీ పోలీసులు సోదాలు చేపట్టారు.
హైదరాబాద్, నవంబర్ 13: ఉగ్రవాద ఆరోపణలతో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఇంట్లో అర్ధరాత్రి సోదాలు జరిగాయి. రాజేంద్రనగర్ ఫోర్త్ వ్యూ కాలనీలోని సయ్యద్ నివాసంలో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తనిఖీలు జరిపారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి మరీ పోలీసులు సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో మూడు రకాల లిక్విడ్‌తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాల్లో పాల్గొన్నాయి.
సోదాలపై టెర్రరిస్ట్ బ్రదర్ ఒమర్ ఫారూఖీ మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌లోనీ తమ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు జరిపారని.. ప్రస్తుతం తమ ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేవని చెప్పారు. తమ ఇంట్లో మరోసారి గుజరాత్ పోలీసులు సోదాలు జరుపుతున్నారన్నది అవాస్తవమని చెప్పుకొచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సోదాల్లో అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం గంటన్నర పాటు సోదాలు జరిపినట్లు వివరించారు. మూడు రకాల లిక్విడ్ తో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారన్నారు.
తనకు నోటీసులు అందజేసి సెర్చ్ నిర్వహించారని.. సామాగ్రి సీజ్ చేసి గుజరాత్‌కు వెళ్లిపోయారని తెలిపారు. రాజేంద్రనగర్‌లోని పిల్లర్ నెంబర్ 122 వద్ద తమ బ్రదర్ మొహయోద్దీన్ హోటల్ గెలాక్సీలో షవర్మ బిజినెస్ చేసినట్లు చెప్పారు. అక్కడ కూడా మంగళవారం అర్ధరాత్రి ఏటీఎస్ పోలీసులు సోదాలు జరిపారన్నారు. తన బ్రదర్ టెక్నాలజీ ఏం వాడుతున్నాడు, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాడా? లేడా? అనే విషయం తమకు తెలియదని ఒమర్ ఫారూఖీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సెన్సార్ పూర్తి... రిలీజ్‌కు రెడీ
ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్
Read Latest Telangana News And Telugu News