Share News

Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Nov 13 , 2025 | 07:00 AM

టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు.

Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్

- నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌(TGSPDCL Balajinagar Section) పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం శుక్రవారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాందేవ్‌రావు హాస్పిటల్‌, ఆకార్‌ ఆషా హాస్పిటల్‌, శివానంద రిహాబిలిటేషన్‌ కేంద్రం, బిగ్‌ సీ, కల్యాణ్‌ జ్యువెలర్స్‌, విజేత సూపర్‌ మార్కెట్‌.. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసాపేట్‌ వార్డు ఆఫీస్‌, గూడ్స్‌షెడ్‌ రోడ్డు, యాదవ బస్తీ, అంబేడ్కర్‌ నగర్‌, ఎస్పీ నగర్‌, జేపీ నగర్‌, పార్కింగ్‌ ఏరియా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


అల్లాపూర్‌ డివిజన్‌లో..

అల్లాపూర్‌..: అల్లాపూర్‌ డివిజన్‌(Allapur Division)లోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏఈ రాకే్‌షగౌడ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 11కేవీ పద్మావతి నగర్‌ ఫీడర్‌ పరిధిలోని జేకే పాయింట్‌ హోటల్‌, రాణాప్రతాప్‌ నగర్‌, ఆర్‌కే సొసైటీ, థామస్‌ స్కూల్‌, శివబిస్తీ ప్రాంతం, కే.ఎ్‌స.నగర్‌, దర్గా ఏరియా, అల్లాపూర్‌ బస్తీ ప్రాంతాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ ఉండదన్నారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌(Azamabad Division) పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ జి. నాగేశ్వరరావు తెలిపారు. సాయిబాబా టెంపుల్‌, సీఈకాలనీ, గోల్కొండక్రా్‌సరోడ్‌ పరిధిలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు, మౌలానా ఆజాద్‌నగర్‌ పరిధిలో 10నుంచి 12వరకు, నెహ్రూనగర్‌లో 11.30నుంచి 1 వరకు, రామాలయం, స్పెన్సర్‌, ఎల్‌ఎన్‌ నగర్‌ పరిధిలో 2నుంచి సాయంత్రం 5వరకు వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


city1.2.jpg

చంపాపేట: చంపాపేట(Champapet) 11కేవీ ఫీడర్‌లో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఫీడర్‌ పరిధిలోని సాయిరాంనగర్‌కాలనీ, శిఖరా ఎన్‌క్లేవ్‌, నాగర్జున కాలనీ, ఆర్టీసీ కాలనీ, భానునగర్‌, కేశవనగర్‌, సింగరేణికాలనీ, రాఘవేంద్రకాలనీలో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

రాజేంద్రనగర్‌: పహాడి 11 కేవీ ఫీడర్‌ పరిధిలో గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, సులేమాన్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరా యం ఉంటుందని విద్యుత్‌ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పహాడి, సులేమాన్‌నగర్‌, హబీబీ యా కబరస్తాన్‌, నానా మజీద్‌, డైమండ్‌ సిటీ, సులేమాన్‌నగర్‌, బాబా దర్గా, మహమూద్‌ బాబా దర్గా ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిమెంట్‌ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

సైబర్‌ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్‌ ఎడ్జ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2025 | 07:00 AM