Lion Attack: రెండేళ్ల చిన్నారిని అడవిలోకి లాక్కుపోయిన సింహం
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:36 AM
ఇంటి ఆవరణలో తన తల్లితో కలిసి రెండేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. వీరిపై ఉన్నఫళంగా ఒక సింహం దాడి చేసింది. చిన్నారిని నోట కరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. ఒక కిలో మీటర్ దూరంలో అటవీ అధికారులు విగత జీవిగా పడి ఉన్న చిన్నారిని గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా, గిర్ గఢద తాలూకాలో ఓ రెండేళ్ల చిన్నారి సింహానికి బలైంది. ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన గిర్ జాతీయ వన్యప్రాణుల పార్కు సమీపంలో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో జరిగింది. చిన్నారి మృతదేహాన్ని అడవిలోని ఒక కిలోమీటరు దూరంలో కనుగొన్నారు.
హర్సుఖ్‌భాయ్ మక్వానా అనే బాలిక ఇంటి ప్రాంగణంలో తన తల్లితో కలిసి ఆడుకుంటుండగా ఒక్క సారిగా సింహం వారి మీదకి వచ్చింది. నోట కరుచుకుని చిన్నారిని అడవిలోకి ఈడ్చుకుపోయింది. దీంతో ఏంచేయాలో పాలుపోని తల్లి వెంటనే అడవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. సింహం దాడి చేసినట్టు అనుమానిస్తున్నామని, చిన్నారి మృతదేహాన్ని త్వరగా కనుగొన్నామని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ బీబీ వాలా తెలిపారు.
గిర్ జాతీయ వన్యప్రాణుల పార్కు ప్రాంతంలో ఆసియా సింహాలు ఎక్కువగా ఉండటంతో, ఇలాంటి దాడులు అప్పుప్పుడు జరుగుతూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన స్థానికుల్లో భయాన్ని రేకెత్తించింది. అధికారులు భద్రతా చర్యలు పెంచుతూ, ముందస్తు చర్యలు చేపట్టారు.
గిర్ జాతీయ వన్యప్రాణుల పార్కు ప్రాంతంలో ఆసియా సింహాలు ఎక్కువగా ఉండటంతో, ఇలాంటి దాడులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన స్థానికుల్లో భయాన్ని రేకెత్తించింది. అధికారులు భద్రతా చర్యలు పెంచుతూ, ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News