Home » Spain
స్పెయిన్‌లోని భారత రాయబారి దినేష్ కె.పట్నాయక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు 16వ ఎయిర్ బస్ సి-295ను సెవిల్లెలోని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేష్ అసెంబ్లీ లైన్‌లో అందుకున్నారు. స్పెయిన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్'లో తెలియజేసింది.
పాస్‌పోర్టులేని ఓ పదేళ్ల చిన్నారిని అతడి తల్లిదండ్రులు ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టి విహారయాత్రకు వెళ్లిపోయిన షాకింగ్ ఉదంతం స్పెయిన్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట కలకలం రేపుతోంది.
Parents Abandon Son: బాలుడు జరిగిందంతా వారికి చెప్పాడు. అధికారులు ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. ఆ వెంటనే పిల్లాడి తల్లిదండ్రులు వెళుతున్న విమానం పైలట్‌ను సంప్రదించారు.
డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్‌లో పర్యటిస్తోంది. భారతదేశ అధికార భాషపై ఈ సందర్భంగా మాడ్రిడ్‌లో ఎన్అర్ఐలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లుఫ్తాన్సా విమానం గాల్లో ఉండగా పైలట్‌కు స్పృహ తప్పడంతో విమానం పది నిమిషాల పాటు ఎవరి పర్యవేక్షణ లేకుండానే ప్రయాణించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతేడాది జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన స్పెయిన్ ప్రభుత్వం తాజాగా నివేదికను విడుదల చేసింది.
Spain children Locked: కరోనా కారణంగా ఓ కుటుంబం తీవ్రంగా భయపడిపోయింది. దీంతో పిల్లలను కూడా గత ఆరేళ్లుగా బయటకు రానీవ్వలేదు. ఈ విషయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చిన్నారులను రక్షించారు.
విద్యుత్ తీవ్ర అంతరాయంతో స్పానిష్, పోర్చిగీస్ ప్రభుత్వాలు అత్వవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాయి. ఐబీరియన్ ద్వీపకల్పం అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు పోర్చుగల్ యుటిలిటీ REN ధ్రువీకరించింది.
వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయినా ప్రభుత్వం సకాలంలో సాయం చేయలేదంటూ స్పెయిన్ దేశం రాజు ఫెలిపే-4పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పెయిన్‌లో వర్షం కారణంగా వచ్చిన వరదలు విధ్వంసం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో బురద ఏర్పడి ఎక్కడికక్కడ చిత్తడిగా మారింది. దీంతో ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
స్పెయిన్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వివిధ నగరాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో వేలాది కార్లు వరద నీటిలో కొట్టుకు పోయాయి. పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకోవడంతో ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది.