Share News

Spain: విమానం గాల్లో ఉండగా పైలట్‌కు స్పృహ తప్పడంతో..

ABN , Publish Date - May 18 , 2025 | 07:10 PM

లుఫ్తాన్సా విమానం గాల్లో ఉండగా పైలట్‌కు స్పృహ తప్పడంతో విమానం పది నిమిషాల పాటు ఎవరి పర్యవేక్షణ లేకుండానే ప్రయాణించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతేడాది జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన స్పెయిన్ ప్రభుత్వం తాజాగా నివేదికను విడుదల చేసింది.

Spain: విమానం గాల్లో ఉండగా పైలట్‌కు స్పృహ తప్పడంతో..
Lufthansa Flight Flew Without a Pilot

ఇంటర్నెట్ డెస్క్: లుఫ్తాన్సా విమానంలో గతేడాది షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాక్‌పిట్‌లోని పైలట్‌కు అకస్మాత్తుగా స్పృహ తప్పడంతో విమానం 10 నిమిషాల పాటు తనంతట తానుగా ఆటోపైలట్ సాయంతో ప్రయాణించింది. గతేడాది ఫిబ్రవరిలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి స్పెయిన్‌లోని సెవిల్‌కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్‌బస్ విమానంలో ఈ ఘటన జరిగింది.

ఘటన సమయంలో ప్రధాన పైలట్ రెస్ట్‌రూమ్‌కు వెళ్లగా కోపైలట్ విమానాన్ని నడుపుతున్నారు. ఇంతలో అనారోగ్యం కారణంగా కోపైలట్‌ 10 నిమిషాల పాటు స్పృహ కోల్పోయారు. ఈ సమయంలో విమానం పైలట్ పర్యవేక్షణ ఏదీ లేకుండానే ప్రయాణించింది. ఆ సమయంలో విమానంలో సుమారు 199 మంది ప్రయాణికులు ఉన్నారు.


రెస్ట్ రూమ్ నుంచి బయటకొచ్చిన పైలట్ కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.తన సాధారణ కోడ్ యూజ్ చేసి.. కాక్‌పిట్‌లోని కోపైలట్‌ను తలుపుతీయాలని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించారు. కానీ లోపలి నుంచి స్పందన రాలేదు. క్రూ సిబ్బంది కూడా ఫోన్ ద్వారా కోపైలట్‌ను అలర్ట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈలోపు ప్రధాన పైలట్ ఎమర్జెన్సీ కోడ్ ద్వారా కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా కోపైలట్‌కు మెళకువ వచ్చి తలుపు తీశారు. ఆ తరువాత ప్రధాన పైలట్ విమానాన్ని మ్యాడ్రిడ్‌లో దింపారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న కోపైలట్‌ను ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని లుఫ్తాన్సా స్పెయిన్ అధికారులకు తెలిపింది. దీనిపై అంతర్గత విచారణ జరిపినట్టు కూడా వెల్లడించింది. అయితే, విచారణ నివేదిక వివరాలు మాత్రం విడుదల చేయలేదు. ఇక కోపైలట్ అనారోగ్యానికి గురయ్యారనేందుకు సూచనగా కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో అసాధారణ శబ్దాలు కూడా రికార్డైనట్టు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపిన స్పెయిన్ అధికారులు తాజాగా నివేదికను విడుదల చేశారు.

Also Read:

ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..

RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..

తుర్కియే అధ్యక్షుడి ఆధిపత్య ప్రదర్శన.. వేలు పట్టుకుని వదలకుండా..

Read Latest and International News

Updated Date - May 18 , 2025 | 07:16 PM