Share News

Power Outage: స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం

ABN , Publish Date - Apr 28 , 2025 | 08:30 PM

విద్యుత్ తీవ్ర అంతరాయంతో స్పానిష్, పోర్చిగీస్ ప్రభుత్వాలు అత్వవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాయి. ఐబీరియన్ ద్వీపకల్పం అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు పోర్చుగల్ యుటిలిటీ REN ధ్రువీకరించింది.

Power Outage: స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్‌లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం

మాడ్రిడ్: ఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్‌లో సోమవారంనాడు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫ్రాన్స్‌లోనూ ఈ ప్రభావం కనిపించింది. దీంతో ప్రజా రవాణాకు సమస్యలు తలెత్తాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి. విమానాశ్రాయాలు, రైలు సర్వీసుల ఈ ప్రభావం పడింది. విద్యుత్ సరఫరాకు తలెత్తిన అంతరాయంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

Ukraine Ceasefire: మే 8 నుంచి 10 వరకూ ఉక్రెయిన్‌పై రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ


కాగా, యూరోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో సమస్య తలెత్తడమే ఇందుకు కారణమనే కథనాలు వెలువడ్డాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేదుకు ప్రయత్నిస్తున్నట్టు రెడ్ ఎలక్ట్రికా సంస్థ తెలిపింది. విద్యుత్ తీవ్ర అంతరాయంతో స్పానిష్, పోర్చిగీస్ ప్రభుత్వాలు అత్వవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాయి. ఐబీరియన్ ద్వీపకల్పం అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు పోర్చుగల్ యుటిలిటీ REN ధ్రువీకరించింది. ఫ్రాన్స్‌పైనా కొంత ప్రభావం చూపించినట్టు తెలిపింది. యూరోపియన్ ఎనర్జీ ప్రొడ్స్యూసర్స్, ఆపరేటర్ల సమన్వయంతో విద్యుత్ సరఫరాను దశలవారిగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు REN సంస్థ ప్రకటించింది. సమస్యకు కారణాలను విశ్లేషిస్తున్నట్టు తెలిపింది.


కాగా, మాడ్రిడ్ అండర్‌గ్రౌండ్‌ను ఖాళీ చేయించినట్టు స్పానిష్ రేడియా స్టేషన్ తెలిపింది. మాడ్రిడ్ సిటీ సెంటర్‌లో లైట్లు పనిచేయకపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు తలెత్తినట్టు వెల్లడించింది. మాడ్రిడ్ సిటీలో వేలాది మంది ప్రజలు తమ కార్యాలయాలు వదలిపెట్టారు. కీలకమైన భవంతుల వద్ద భారీగా పోలీసులు మోహరించి ట్రాఫిక్ డైవర్షన్ చేపడుతున్నారు. అనేక మంది మెట్రో కార్లు, ఎలివేటర్లరో చిక్కుకుపోయినట్టు లోకల్ రేడియా సమాచారం ఇచ్చింది. కాగా, విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలిచిపోయిందని, తిరిగి పునరుద్ధరించామని, సమస్యకు కారణాలు తెలుసుకుంటున్నామని ఫ్రాన్స్ గ్రిడ్ ఆపరేటర్ RTE తెలిపింది.


ఇవి కూడా చదవండి..

US Rescinds Decision: విద్యార్థుల బహిష్కరణపై వెనక్కి!

Saudi Arabia: హజ్‌ వీసా ఉంటేనే మక్కాలోకి అనుమతి

Updated Date - Apr 28 , 2025 | 08:34 PM