Share News

Spanish Worker Fired: ఆఫీస్‌కు ప్రతీ రోజు తొందరగా వస్తోందని బాస్ పైశాచికత్వం..

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:39 AM

ఆఫీస్‌కు ప్రతీ రోజూ అందరికంటే ముందుగా వస్తోందని ఉద్యోగిణిపై పగ పెంచుకున్నాడు ఓ కంపెనీ బాస్. ఆమె ఎంత చెప్పినా షిఫ్ట్ టైం కంటే ముందుగా వస్తూనే ఉండటంతో ఉద్యోగంలోంచి తీసేశాడు. దీంతో ఆ యువతి కోర్టును ఆశ్రయించింది.

Spanish Worker Fired: ఆఫీస్‌కు ప్రతీ రోజు తొందరగా వస్తోందని బాస్ పైశాచికత్వం..
Spanish Worker Fired

సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఆలస్యంగా వస్తే బాస్‌కు కోపం వస్తుంది. మొదట వార్నింగ్ ఇస్తాడు. ఎంత చెప్పినా అదే పనిగా ఆఫీస్‌కు ఆలస్యంగా వస్తూ ఉంటే ఉద్యోగం లోనుంచి తీసేస్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఆఫీస్‌కు ప్రతీ రోజూ అందరికంటే ముందుగా వస్తోందని ఉద్యోగిణిపై పగ పెంచుకున్నాడు ఓ కంపెనీ బాస్. ఆమె ఎంత చెప్పినా షిఫ్ట్ టైం కంటే ముందుగా వస్తూనే ఉండటంతో ఉద్యోగంలోంచి తీసేశాడు. దీంతో ఆ యువతి కోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ సంఘటన స్పెయిన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. స్పెయిన్‌కు చెందిన ఓ యువతి గత కొన్నేళ్లుగా స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పని చేస్తూ ఉంది. ఆమెకు ఉదయం 7.30 గంటల షిఫ్ట్ కేటాయించారు. అయితే, ఆ మహిళ ప్రతీ రోజూ ఆఫీస్‌కు 40 నిమిషాలు ముందుగానే వచ్చేది. 6.45 గంటల నుంచి 7.00 గంటల లోపు ఆఫీస్‌లో ఉండేది. ఇది బాస్‌కు నచ్చేలేదు. కేటాయించిన షిఫ్ట్ సమయానికి రావాలని ఆమెకు చెప్పాడు. అయితే, ఆ యువతి మాత్రం అతడి మాటలు లెక్కచేయలేదు. ముందుగానే ఆఫీస్‌కు వస్తూ ఉంది. బాస్ ఆమెకు పలు మార్లు వార్నింగ్ ఇచ్చాడు. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశాడు. అయినా ఆమె పద్దతిలో ఎలాంటి మార్పు రాలేదు.


2023 నుంచి బాస్ ఆమెకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఆమె బాస్ వార్నింగ్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా 19 సార్లు ఆఫీస్‌కు ముందుగా వచ్చింది. దీంతో ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది. యువతి కండక్ట్ బాగోలేదని ఉద్యోగం లోనుంచి తీసేశాడు. ఆ యువతి అలికాంటే కోర్టును ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. కోర్టు విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఫిజికల్‌గా ఆఫీస్‌‌కు రాకముందే కంపెనీ యాప్ ద్వారా లాగ్ ఇన్ పెట్టేదని తేలింది. కంపెనీ కారు బ్యాటరీని ఆమె అమ్మేసిందని వెల్లడైంది. కోర్టు బాస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. యువతి వర్క్‌ప్లేస్ రూల్స్ పాటించటం లేదని, స్పెయిన్ వర్కర్స్ స్టాట్యూట్‌లోని ఆర్టికల్ 54 ప్రకారం ఇది సీరియస్ వాయిలేషన్ అని కోర్టు పేర్కొంది. ఇక, ఆ యువతి వాలెన్సికా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సిద్ధమైంది.


ఇవి కూడా చదవండి

ఏఐ రేసులో వినియోగ దేశాలే విజేతలు

ఊబకాయానికి సిప్లా ఔషధం

Updated Date - Dec 11 , 2025 | 06:50 AM