Parents Abandon Son: మీరసలు తల్లిదండ్రులేనా.. కన్న కొడుకును అలా వదిలేసి పోతారా?
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:30 PM
Parents Abandon Son: బాలుడు జరిగిందంతా వారికి చెప్పాడు. అధికారులు ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. ఆ వెంటనే పిల్లాడి తల్లిదండ్రులు వెళుతున్న విమానం పైలట్‌ను సంప్రదించారు.

సమాజంలో విలువలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. కన్నవాళ్లే తమ ఎంజాయ్‌మెంట్ కోసం పిల్లల్ని పట్టించుకోవటం లేదు. తాజాగా, స్పెయిన్‌లో మనసు కలిచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ జంట తమ కొడుకును ఎయిర్ పోర్టులో వదిలేసి వెకేషన్‌కు వెళ్లిపోయింది. పాపం ఆ పిల్లాడు.. తల్లిదండ్రులు చేసిన పనికి ఎయిర్ పోర్టులో ఒంటరిగా అల్లాడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ జంట వెకేషన్‌కు వెళ్లడానికి తమ ఇద్దరు కొడుకులతో కలిసి స్పెయిన్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది.
ఎయిర్ పోర్టులో చెకింగ్స్ సందర్భంగా వారి పెద్ద కొడుకు(10) పాస్ పోర్ట్ ఎక్స్‌పైర్ అయినట్లు తేలింది. ఆ తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా పిల్లాడ్ని ఎయిర్ పోర్టులోనే వదిలేయాలని అనుకున్నారు. బంధువులకు ఫోన్ చేసి పిల్లాడ్ని తీసుకెళ్లమన్నారు. ఆ పిల్లాడు టెర్మినల్‌లోనే ఉండిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు, తమ్ముడు విమానం ఎక్కేశారు. పాపం ఆ బాలుడు టెర్మినల్‌లో ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ పోర్టు అధికారులు బాలుడ్ని చూశారు.
ఏమైందని అతడ్ని అడిగారు. బాలుడు జరిగిందంతా వారికి చెప్పాడు. అధికారులు ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టారు. ఆ వెంటనే పిల్లాడి తల్లిదండ్రులు వెళుతున్న విమానం పైలట్‌ను సంప్రదించారు. ఆ పైలట్ ‘మీలో ఎవరైనా మీ పిల్లాడిని ఎయిర్ పోర్టు టెర్మినల్‌లో వదిలేశారా?’ అని ప్రశ్నించాడు. ఇందుకు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. అయితే, అధికారులు మాత్రం ఆ తల్లిదండ్రుల్ని గుర్తించారు. వారితో పాటు వారి చిన్న కొడుకు ఉండటంతో ఇట్టే కనిపెట్టారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి
మానవత్వం మరిచిన పోలీస్.. మరీ ఇంత దారుణమా..
లంచ్ చేసుకోవడానికి టైం ఉండట్లేదా.. 5 ఫాస్ట్ రెసిపీ ఐడియాస్ మీకోసమే..