Home » RRR
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రేవంత్ ప్రభుత్వం రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రకటించింది.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు అంశంలో కీలక ముందడుగు పడింది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఎట్టకేలకు కేంద్రానికి చేరింది.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని 201 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భాగం నిర్మాణానికి సంబంధించి మూడు అలైన్‌మెంట్లను మంత్రివర్గం ముందు ఉంచారు.
రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర, దక్షిణ మార్గాలు ఒకేసారి నిర్మించే అవకాశాలపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గురువారం ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర/ దక్షిణ మార్గాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు.
రీజీనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ విధానం (హ్యామ్)లో అభివృద్ధి చేయబోయే రోడ్లు, హైదరాబాద్-మంచిర్యాల గ్రీన్‌ఫీల్డ్ రహదారులపైనా చర్చించారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం నాలుగు జాతీయ రహదారులు, ఒక రాష్ట్ర రహదారి అనుసంధానంతో నిర్మితం కానుంది. ఈ రహదారి ఆరు జిల్లాల మీదుగా వెళ్లనుంది.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకుపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారికి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది.
RRR featured in Oscars Poster: ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరి వచ్చి చేరింది. కొత్త జాబితాను ప్రకటించే క్రమంలో ఆస్కార్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్‌ను ఉపయోగించింది.
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయంలో 50 శాతాన్ని భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజినల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ను అనుసంధానం చేసేలా నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు టెండర్ నోటీ్‌సపై యథాతథ స్థితి (స్టేటస్ కో) విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.