Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం 201 కిలోమీటర్లు
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:32 AM
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని 201 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భాగం నిర్మాణానికి సంబంధించి మూడు అలైన్‌మెంట్లను మంత్రివర్గం ముందు ఉంచారు.

2వ అలైన్‌మెంట్‌కు క్యాబినెట్ ఆమోదం
అటవీ అనుమతులు అవసరం లేదు
3 ప్రతిపాదనలపై చర్చ.. రెండో దానికి ఓకే
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని 201 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భాగం నిర్మాణానికి సంబంధించి మూడు అలైన్‌మెంట్లను మంత్రివర్గం ముందు ఉంచారు. వాటిలో రెండో ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి ప్రతిపాదన 189.5 కి.మీ., రెండోది 201 కి.మీ., మూడోది 218 కి.మీ.గా పేర్కొన్నారు. అయితే మొదటి ప్రతిపాదనలో 96 శాతం వ్యవసాయ భూమి, 3 శాతం నిర్మాణాలు ఉన్నాయి. మూడో ప్రతిపాదనలోనూ అంతే ఉన్నట్లు తెలిసింది. రెండో ప్రతిపాదనలో మాత్రం 99 శాతం వ్యవసాయ భూములు, ఒక శాతం నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో అటవీ భూములు కూడా లేవు. మొదటి, మూడో ప్రతిపాదనల్లో అటవీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అవసరం లేకుండా ఉండేందుకు మంత్రివర్గం రెండో ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందులో కేవలం పర్యావరణ అనుమతులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అలైన్‌మెంట్‌లో 2010 హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని, 55 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. మంత్రివర్గం దక్షిణ భాగం రహదారి రెండో ఆలైన్‌మెంట్‌కే సమ్మతి తెలిపింది.
రెండు నెలలూ జనం మధ్యనే..
స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్‌లో చర్చ జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ జరగలేదని మంత్రి పొన్నం తెలిపారు. స్థానిక ఎన్నికలపై కోర్టులో కేసు తేలిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికే కొంత సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజల మధ్యనే ఉండాలని క్యాబినెట్‌లో నిర్ణయించినట్లు సమాచారం. రాబోయే రెండు నెలలు ప్రజల మధ్యనే ఉంటూ స్థానిక ఎన్నికల్లో సత్తా
ఇవి కూడా చదవండి..
అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
For National News And Telugu News