ఆస్కార్ పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్.. రాజమౌళి హర్షం

ABN, Publish Date - Apr 11 , 2025 | 04:25 PM

RRR featured in Oscars Poster: ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరి వచ్చి చేరింది. కొత్త జాబితాను ప్రకటించే క్రమంలో ఆస్కార్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్‌ను ఉపయోగించింది.

చలనచిత్రరంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్. ఇప్పుడు ఇందులో మరో కేటగిరి వచ్చి చేరింది. ఇకపై స్టంట్ డిజైన్ జాబితాలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లుగా అకాడమీ అధికారికంగా వెల్లడించింది. 2027 నుంచి విడుదలకానున్న చిత్రాలను ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. అంటే వందో అకాడమి అవార్డులో ఈ జాబితాను అధికారం చేయనున్నారు నిర్వాహకులు. కాగా.. కొత్త జాబితాను ప్రకటించే క్రమంలో ఆస్కార్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్‌ను ఉపయోగించింది. ఇక హాలీవుడ్ సినిమాల సరసన టాలీవుడ్ సినిమా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆస్కార్‌ ప్రకటనలో ఆర్‌ఆర్‌ఆర్ స్టంట్ ఉండటం పట్ల డైరెక్టర్ రాజమౌళి ఎక్స్‌లో స్పందించారు. స్టంట్ వర్క్‌ను గౌరవించినందుకు ఆస్కార్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Jogi Ramesh CID Inquiry: సీఐడీ విచారణపై జోగి రమేష్ ఏమన్నారంటే

KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

Read Latest Cinema News And Telugu News

Updated at - Apr 11 , 2025 | 04:26 PM