Home » Kesineni Nani
Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.
కేశినేని నాని చేసిన ట్వీట్‌కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్‍లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
Buddha Venkanna: మాజీ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రావెల్స్ పేరుతో కార్మికులను మోసం చేశావని బుద్దా వెంకన్న ఆరోపించారు.
Ex MP Kesineni Nani : దేశవ్యాప్తంగా డీలిమిటేషన్‌పై చర్చ జరుగుతోంది. అలాంటి వేళ.. డీలిమిటేషన్‌పైనే కాకుండా ఉమ్మడి ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని మాజీ ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.
తాను ఎప్పుడూ అందరి మనిషినని.. ప్రజల మనిషినని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) తెలిపారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. సీఎం చంద్రబాబుకు తాను మొదటి నుంచీ అభిమానినని.. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ కేశినేని నాని (Keshineni Nani) రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్(ఎక్స్) వేదికగా నానిపై వెంకన్న వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి సొంత తమ్ముడి కేశినేని చిన్ని చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాననని వెల్లడించారు.