Share News

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్

ABN , Publish Date - Apr 25 , 2025 | 05:02 PM

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు.

Kesineni Brothers War: కేశినేని బ్రదర్స్ వార్.. సోషల్ మీడియాలో అన్నదమ్ముల సవాల్
Kesineni Brothers War

అమరావతి, ఏప్రిల్ 25: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) (Vijayawada MP Kesineni Chinni), ఆయన సోదరుడు కేశినేని నాని (Kesineni Nani) మధ్య సోషల్ మీడియా వార్ ముదురుతోంది. అన్నదమ్ములు ఇద్దరూ ఒకరిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్న పరిస్థితి. గత ఎన్నికల్లో కేశినేని చిన్ని చేతిలో కేశినేని నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన నాని.. ఇప్పుడు మరోసారి సోదరుడు చిన్నిపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. నాని ట్వీట్‌కు చిన్ని కౌంటర్‌ ట్వీట్లతో ఇరువురి మధ్య సోషల్ మీడియా వార్‌కు తెరలేచింది. చిన్ని అనేక అక్రమాలకు పాల్పడ్డారని నాని ట్వీట్ చేయగా.. సోషల్ మీడియా రోడ్లపై సైకో తిరుగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కేశినేని చిన్ని కౌంటర్ ఎటాక్ చేశారు.


అయితే సోషల్ మీడియాలో కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై చిన్ని రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. దీనిపై కేశినేని నాని స్పందిస్తూ.. దేనికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. రూ.100 కోట్లకు కాదు, రూ.1000 కోట్లకు పరువు నష్టం వేసినా భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సంపద దోచుకునే వారిపైనే తన పోరాటం అంటూ పోస్ట్ పెట్టారు నాని. సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్‌ నుంచి తనకు లీగల్ నోటీసు అందిందన్నారు. తాను భయంతో రాజీ పడకుండా.. నిర్భయంగా వాస్తవాలతో బహిరంగంగా స్పందిస్తాను తప్పా మౌనంగా ఉండేది లేదంటూ కేశినేని నాని పోస్టు పెట్టారు.

పేలిపోయిన టెర్రరిస్టుల ఇళ్లు


కాగా.. ఇటీవల కేశినేని బ్రదర్స్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు మళ్లీ షురూ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా అన్నదమ్ములిద్దరూ పోస్టుల యుద్ధానికి తెరలేపారు. ఇటీవల చిన్నీపై కేశినేని పలు ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చిన్నీ ఎన్నో అక్రమ దందాలకు పాల్పడ్డారని, ఇసుక వ్యాపారం, ఫ్లెయాష్, గ్రావెల్, భూదందాలు, పేకాట గృహాలు నడిపించారని, రేషన్ బియ్యం మాఫియా ఇలా అనేక చోట్ల వసూళ్లకు పాల్పడ్డారంటూ పోస్టు చేశారు నాని. అయితే కేశినేని నాని ట్వీట్‌కు బదులుగా కౌంటర్ ఇచ్చారు కేశినేని చిన్ని. సోషల్ మీడియాలో ఓ సైకో రెచ్చిపోతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ కేశినేని శివనాథ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి

JS Chandramouli funeral: చంద్రమౌళి ముఖాన్ని చూసి తట్టుకోలేకపోయిన భార్య

Borugadda Anil Supreme Court: బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంలో చుక్కెదురు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 05:19 PM