Share News

Kesineni Nani.. రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..

ABN , Publish Date - Feb 17 , 2025 | 09:12 AM

ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని మాజీ ఎంపీ కేశినేని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

Kesineni Nani.. రాజకీయ రిటైర్మెంట్‌పై కేశినేని నాని ఏమన్నారంటే..
Kesineni Nani Statement

అమరావతి: ఇటీవల మీడియా ఊహాగానాలపై మాజీ ఎంపీ కేశినేని నాని (Ex MP Kesineni Nani) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విజయవాడ (Vijayawada)లో మీడియా (Media)తో మాట్లాడుతూ.. తన రాజకీయ రిటైర్‌మెంట్ (Political Retirement) గురించి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. గత ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించానని.. ఆ నిర్ణయం మారదని అన్నారు. అయితే, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను హృదయపూర్వకంగా నమ్ముతున్నానన్నారు.

ఈ వార్త కూడా చదవండి..

వల్లభనేని వంశీకి జైలులో భద్రత


ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని కేశినేని అన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని.. కానీ విజయవాడలోని తన తోటి పౌరుల శ్రేయస్సు కోసం లోతైన అంకితభావంతో ముడిపడి ఉందన్నారు. తన రాజకీయ పునరాగమనానికి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని అందరినీ కోరుతున్నానని అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, దాని ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే తన దృష్టి ఉందని, తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి తాను కృతజ్ఞతలు తెలుపుతిన్నానని.. అదే అభిరుచి, నిబద్ధతతో తన సేవను కొనసాగించడానికి ఎదురుచూస్తున్నానని కేశినేని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్త జనసంద్రంగా మారిన పెద్దగట్టు

ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

ఉప్పల్‌లో 9 వైజాగ్‌లో 2

జగన్‌ నివాసం వద్ద గడ్డి ‘దహనం’పై సందేహాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 17 , 2025 | 10:45 AM