Home » Airbus
స్పెయిన్‌లోని భారత రాయబారి దినేష్ కె.పట్నాయక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు 16వ ఎయిర్ బస్ సి-295ను సెవిల్లెలోని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేష్ అసెంబ్లీ లైన్‌లో అందుకున్నారు. స్పెయిన్‌లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్'లో తెలియజేసింది.
అమెరికాకు చెందిన అనీశ్ అగర్వాల్ తల్లి, తండ్రి.. అనీశ్ సోదరుడు ఈనెల 27న ఎయిర్ ఇండియా విమానం (ఏ1-190)లో టొరంటో నుంచి ఢిల్లీ మీదుగా పుణె రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఎయిర్ ఇండియా సంస్థ వారి ప్రయాణ తేదీలను మార్చేసింది!
ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కలల ప్రపంచంలో విహారమే. దానినో హోదాగా, గర్వంగా భావించేవారు. తర్వాత పరిస్థితి మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం విమాన ప్రయాణాన్ని ఓ భయంగా మార్చేసింది.
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు ఉండేవి. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఇతర నగరాలకు కూడా కనెక్టివిటీ పెరిగింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి కొత్తగా ఢిల్లీ, ముంబై నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ‘ఎయిర్ బస్’ సంస్థ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉంది.
హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ A330 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సియాటెల్- టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 273 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇది హోనోలులులోని డేనియల్ కె.ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఫ్లైట్ డెక్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ చెప్పారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారం నిమిత్తం శుక్రవారం ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రధాన మంత్రికి ఇబ్బందులు ఎదురయ్యాయి.
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
ఇటీవల భారత్‌లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్ వచ్చాయి.