Seattle: హవాయి విమానంలో పొగలు.. కొంచెం తేడా కొట్టి ఉంటే ఆ సీన్ రిపీట్..
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:38 PM
హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ A330 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సియాటెల్- టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 273 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇది హోనోలులులోని డేనియల్ కె.ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఫ్లైట్ డెక్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి.

సీటెల్: ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దక్షిణ కొరియా మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాద ఘటనే మరవకముందే మరో విమానం ప్రమాదానికి గురైందన్న వార్త కలకలం సృష్టిస్తోంది. పైలట్, ఎయిర్‌లైన్స్ అధికారుల అప్రమత్తంగా వ్యవరించడంతో వందల మంది ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. సమస్యను సకాలంలో గుర్తించపోయుంటే దక్షిణ కొరియా ఘటన పునరావృతం అయ్యేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడే తమను రక్షించాడంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
అమెరికా దేశం హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్ బస్ A330 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సియాటెల్- టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 273 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో బయలుదేరింది. ఇది హోనోలులులోని డేనియల్ కె.ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా.. ఫ్లైట్ డెక్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి విషయాన్ని వెంటనే హవాయి ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మరిస్సా విల్లెగాస్‌కు ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. కాక్‌పిట్‌లో నుంచి పొగలు రావడంతో వారి సూచనలు మేరకు హవాయి ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి సీటెల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. పైలట్ అత్యంత చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా కిందకి దింపారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) వెల్లడించింది.
అయితే హవాయి ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 21లో జరిగిన సంఘటనపై ఎఫ్ఏఏ దర్యాప్తు చేపట్టిందని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి విల్లెగాస్ తెలిపారు. ప్రమాదం జరిగితే చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక, వైద్య సిబ్బందిని సైతం అప్రమత్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎయిర్ బస్ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విల్లెగాస్ పేర్కొన్నారు. అయితే విమానం నుంచి ప్రయాణికులు దిగిపోయిన వెంటనే పోర్ట్ ఆఫ్ సీటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఎటువంటి పొగ, వాసనకు సంబంధించి వివరాలు గుర్తించలేదని విమానాశ్రయ ప్రతినిధి పెర్రీ కూపర్ తెలిపారు. మరోవైపు తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ తరఫున ఆయన క్షమాపణలు చెప్పారు.
కాగా, దక్షిణకొరియా దేశం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెజు ఎయిర్‌కు చెందిన ప్యాసింజర్ విమానం ఇటీవల రన్‌వేపై కప్పకూలిన సంగతి తెలిసిందే. రవ్‌వేపై దూసుకెళ్లిన విమానం ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి పేలిపోయింది. ప్రమాద సమయంలో ప్యాసింజర్లు, సిబ్బంది కలిపి మొత్తం 181 మంది ఉండగా.. అందులో 179 మంది మృతిచెందారు. కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
PM Kisan Scheme : 6 వేలు కాదు.. 10 వేలు