A320 Modification: ఇండిగో ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి
ABN , Publish Date - Nov 30 , 2025 | 07:44 AM
ఏ320 విమానాల్లో సాంకేతిక లోపాన్ని సరిదిద్దే మార్పులు చేర్పులు పూర్తయినట్టు ఇండిగో ఎక్స్ వేదికగా తెలిపింది. తాము 90 శాతం మేర మాడిఫికేషన్స్‌ను పూర్తి చేశామని ఎయిర్ ఇండియా కూడా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌బస్‌కు చెందిన ఏ320 మోడల్ విమానాల్లో ఇటీవల సాఫ్ట్‌వేర్ లోపం బయటపడిన విషయం తెలిసిందే. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. భారతీయ ఎయిర్‌లైన్స్ పైనా ఈ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఇండిగో తాజాగా కీలక ప్రకటన చేసింది. తమ ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తయ్యిందని వెల్లడించింది. తమ విమానాల అప్‌డేష్ 90 శాతం మేర పూర్తయ్యిందని ఎయిర్ ఇండియా కూడా ప్రకటించింది. అంతకుముందుకు డీజీసీఏ కూడా కీలక ప్రకటన చేసింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 80 శాతం ఏ320 విమానాల్లో మార్పులు చేర్పులు పూర్తయ్యాయని, ఇక సర్వీసులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలిపింది (IndiGo A320 Modifications Complete).
తమ వద్ద ఉన్న అన్ని 200 ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ పూర్తయ్యిందని ఇండిగో ఎక్స్ వేదికగా వెల్లడించింది. అన్ని విమానాలకు తాజా కాన్ఫిగరేషన్‌ను జోడించామని తెలిపింది. ఇంజనీర్లకు కూడా ధన్యవాదాలు తెలిపింది. ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ వేదికగా ఏ320 అప్‌డేషన్‌కు సంబంధించిన వివరాలు చెప్పింది. తమ ఉన్న వాటిల్లో 90 శాతం ఏ320 విమానాలకు అప్‌డేషన్ పూర్తయ్యిందని చెప్పింది. భారతీయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుమారు 338 ఏ320 విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవసరమని డీజీసీఏ గతంలో ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ఎన్ఐఏ కస్టడీ డిసెంబర్ 5 వరకూ పొడిగింపు
ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి