బసవతారకం ఆస్పత్రిలో ఏఐ ఆధారిత అల్ట్రా సౌండ్
ABN , Publish Date - Apr 01 , 2026 | 10:10 AM
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడిన అత్యాధునిక అల్ట్రా సౌండ్ యంత్రాన్ని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
హైదరాబాద్ సిటీ: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం ఏఐ ఆధారిత ఫీచర్లతో కూడిన అత్యాధునిక అల్ట్రా సౌండ్ యంత్రాన్ని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) తమ సీఎస్ఆర్ కార్యక్రమం కింద అందజేసింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ యంత్రం అందించినందుకు బీడిఎల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే రూ.70 లక్షలతో ఎకం ఫౌండేషన్, ఎస్‌బీఎ్‌ఫసీ సంస్థలు సంయుక్తంగా అందజేసిన ఐసీయూ అంబులెన్స్‌ను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అంబులెన్స్ నడపడానికి అవసరమైన ఇంధనం కోసం రూ.లక్ష విరాళం అందించిన హరికృష్ణ ముళ్లపూడిని సత్కరించారు. పేద క్యాన్సర్ రోగుల చికిత్స నిమిత్తం రూ.4.5 లక్షల విరాళం అందించిన ఐ క్లీన్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మూర్తిని అభినందించారు. క్యాన్సర్ రోగుల సహాయార్థం దాత ప్రమీల అందించిన 50 ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్లను ట్రస్టు బోర్డు సభ్యురాలు నారా బ్రాహ్మణి అందించారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ సీఎండీ కమెడోర్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
భార్యనూ తల్లినీ బెదిరించి..50 వేలకు కన్నబిడ్డ అమ్మకం
Read Latest Telangana News and National News