Share News

రైలు ప్రయాణికులకు షాక్.. రీఫండ్ నియమాల్లో మార్పులు..

ABN , Publish Date - Apr 01 , 2026 | 09:07 AM

భారతీయ రైల్వే టిక్కెట్ రద్దు, రీఫండ్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం, ఖాళీగా ఉండే సీట్లను ఇతరులకు కేటాయించే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.

రైలు ప్రయాణికులకు షాక్.. రీఫండ్ నియమాల్లో మార్పులు..
Indian Railways updates ticket cancellation and refund rules from April 1 2026

ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 1: భారతీయ రైల్వే టిక్కెట్ రద్దు, రీఫండ్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం, ఖాళీగా ఉండే సీట్లను ఇతరులకు కేటాయించే ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ, రీఫండ్ పొందే సమయ పరిమితులను రైల్వే శాఖ పెంచింది.

రీఫండ్ లభించని సమయం (Zero Refund):

గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు టిక్కెట్ రద్దు చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధన ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు టిక్కెట్‌ను రద్దు చేస్తే ప్రయాణికులకు ఒక్క రూపాయి కూడా రీఫండ్ రాదు. చార్ట్ తయారీ సమయంతో సంబంధం లేకుండా ఈ 8 గంటల నిబంధన వర్తిస్తుంది.


50 శాతం రీఫండ్:

ఒకవేళ మీరు ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టిక్కెట్ రద్దు చేసుకుంటే, మీ టిక్కెట్ ధరలో 50 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది. మిగిలిన సగం మొత్తాన్ని రైల్వే శాఖ రద్దు ఛార్జీల కింద మినహాయించుకుంటుంది.

75 శాతం రీఫండ్:

రైలు బయలుదేరడానికి 24 గంటల నుంచి 72 గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేసినట్లయితే, ప్రయాణికులకు 75 శాతం రీఫండ్ లభిస్తుంది. అంటే టిక్కెట్ ధరలో 25 శాతం మొత్తాన్ని రద్దు ఛార్జీలుగా కోత విధిస్తారు.

సాధారణ రద్దు ఛార్జీలు:

ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టిక్కెట్ రద్దు చేసుకుంటే, అప్పుడు కేవలం సాధారణ రద్దు ఛార్జీలు (Normal Cancellation Charges) మాత్రమే విధిస్తారు . మిగిలిన పూర్తి మొత్తాన్ని ప్రయాణికులు తిరిగి పొందవచ్చు.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక

Updated Date - Apr 01 , 2026 | 09:13 AM