Share News

ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళల దారుణ హత్య..

ABN , Publish Date - Apr 01 , 2026 | 09:08 AM

జూబ్లీహిల్స్‌లో వెలుగులోకి వచ్చిన జంట హత్యల కేసు నగరాన్ని కుదిపేసింది. ఓ సైకో కిల్లర్ కేవలం రూ.26,500 కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన షాకింగ్‌గా మారింది.

ఆన్‌లైన్ పేకాట డబ్బుల కోసం ఇద్దరు మహిళల దారుణ హత్య..
Hyderabad Crime News

హైదరాబాద్, ఏప్రిల్ 01: జూబ్లీహిల్స్‌లో వెలుగులోకి వచ్చిన జంట హత్యల కేసు నగరాన్ని కుదిపేసింది. ఓ సైకో కిల్లర్ కేవలం రూ.26,500 కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన షాకింగ్‌గా మారింది. ఆన్‌లైన్ పేకాట వ్యసనానికి బానిసైన నిందితుడు వాసు, డబ్బుల కోసం ఈ ఘోరాలు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల పాటు జూదం ఆడి డబ్బులు కోల్పోయిన వాసు, మూడో రోజు మళ్లీ పేకాట ఆడేందుకు డబ్బుల కోసం ఈ దారుణ నిర్ణయాలు తీసుకున్నాడు.


తొలుత ఫిలింనగర్ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ మహిళను హత్య చేసి, ఆమె శవంపై ఉన్న బంగారాన్ని తీసుకుని తనఖా పెట్టి రెండు రోజులు జూదం ఆడాడు. ఆ డబ్బులు కూడా పోగొట్టుకున్న తరువాత, మరోసారి డబ్బుల కోసం యాదమ్మ అనే వృద్ధురాలిని లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుని హత్య చేశాడు. అనంతరం శవాన్ని కారులో పెట్టుకుని జూబ్లీహిల్స్ నుంచి మొకిలా వరకు సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడ మృతదేహాన్ని పారేశాడు. ఈ కేసులో ఫిలిం నగర్ పోలీసులు నిందితుడు వాసును అరెస్ట్ చేశారు. అతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నగరంలో భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.


ఇవి కూడా చదవండి:

ఉప్పల్‌-నారపల్లి ఫై ఓవర్‌కు బండారి రాజిరెడ్డి పేరు
ఆరు గ్యారంటీల అమలుపై నిలదీయండి

Updated Date - Apr 01 , 2026 | 09:31 AM