Celebrities Betting App Case: 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసులు.. యాక్షన్ ప్లాన్‌కు రంగం సిద్ధం..

ABN, Publish Date - Jul 24 , 2025 | 11:22 AM

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తు్న్న పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED).. విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో సినీ హీరో విజయ్ దేవరకొండకు మరో సారి నోటీసులను జారీచేసింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తు్న్న పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED).. విచారణకు రంగం సిద్ధం చేసింది. ఈ వ్యవహారంలో సినీ హీరో విజయ్ దేవరకొండకు మరో సారి నోటీసులను జారీచేసింది. వచ్చే నెల 11వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో విజయ్ దేవరకొండతో పాటు దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ సహా మొత్తం 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఆగస్టు 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. విజయ్ దేవరకొండ, రానా ఇద్దరూ ఆగస్టు 11న కచ్చితంగా విచారణకు రావాలని తేల్చిచెప్పింది. ప్రకాశ్‌రాజ్‌ ఈ నెల 30న, మంచులక్ష్మి ఆగస్టు 13 తేదీల్లో హాజరు కావాలని ఆదేశించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించి మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యప్తు చేస్తోంది.

Updated at - Jul 24 , 2025 | 11:22 AM