Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:51 PM
పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీ బాత్ 121 వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు.

పెహల్గామ్ ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్నీ బద్ధలు కొట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన్‌కీ బాత్ 121 వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. పెహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని నిరాశను ప్రతిభింభిస్తోందని అన్నారు. కశ్మీర్‌లో తిరిగి శాంతి నెలకొనడం.. దేశ శత్రువులు, జమ్మూ కశ్మీర్ శత్రువులకు నచ్చలేదన్నారు. ఉగ్రవాదులు, వారి యజమానులు.. కశ్మీర్‌ను మరోసారి నాశనం చేయాలని కోరుకుంటున్నారని, అందుకే ఇంత పెద్ద కుట్ర జరిగిందన్నారు. ఉగ్రవాదంపై జరిగే ఈ యుద్ధంలో దేశ ఐక్యత మన అతి పెద్ద బలమని, ఈ సవాల్‌ను ఎదుర్కోవాలనే మన సంకల్పాన్ని మనం బలోపేతం చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.