Fake Cotton Seeds: నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠా గుట్టు రట్టు

ABN, Publish Date - Jun 11 , 2025 | 10:55 AM

ఏపీ నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఓ ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బాపట్ల జిల్లా నుంచి అక్రమంగా పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

సూర్యాపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఓ ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు ఇవాళ(బుధవారం) పట్టుకున్నారు. బాపట్ల జిల్లా నుంచి అక్రమంగా పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. నిందితుల దగ్గరి నుంచి రూ. 65 లక్షల విలువైన 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశామని జిల్లా ఎస్పీ నర్సింహ తెలిపారు. విత్తనాలు, పురుగుల మందులను కొనుగోలు చేసే ముందు రైతులు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని సూచించారు. అన్నదాతలను మోసం చేసే వారిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని ఎస్పీ నర్సింహ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

For More Telangana News and Telugu News..

Updated at - Jun 11 , 2025 | 10:59 AM