Fire Accident: జనగామలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
ABN , Publish Date - Feb 13 , 2025 | 07:11 AM
Huge Fire Accident: తెలంగాణలోని జనగామ జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాదం జరగడంతో పరిశ్రమలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. జనగామ పట్టణంలోని జై భవాని ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్, పెయింట్స్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. దుకాణాల దగ్గరలోని ఇళ్లలో ఉన్న ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. రూ. 50 లక్షలకు పైగానే ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్నిమాపక వాహనాలు వచ్చే సరికి విలువైన పరికరాలు, సామాగ్రి పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి.
సంఘటన జరిగిన స్థలానికి జనగామ డీపీసీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్ నితిన్ , జనగామ సీఐ దామోదర్ రెడ్డి, నర్మెట్ట సీఐ అబ్బయ్య చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే సంటఘన స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరగడంతో దుకాణ యజమానులతో పాటు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News