Share News

Dogs in Hanumakonda: హనుమకొండలో వీధి కుక్కల బీభత్సం.. చిన్నారులకు తీవ్రగాయాలు

ABN , Publish Date - Oct 26 , 2025 | 09:18 PM

హనుమకొండలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి.

Dogs in Hanumakonda: హనుమకొండలో వీధి కుక్కల బీభత్సం.. చిన్నారులకు తీవ్రగాయాలు
Dogs in Hanumakonda

హనుమకొండ, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): హనుమకొండ (Hanumakonda)లో రోజురోజుకూ వీధి కుక్కల (Dogs) దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


న్యూశాయంపేటలో..

న్యూశాయంపేటలో రోడ్డుపై వెళ్తున్న చిన్నారిపై వీధి కుక్కలు ఇవాళ(ఆదివారం) ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అటుగా వస్తున్న ఓ వ్యక్తి గుర్తించి కుక్కలను తరిమికొట్టడంతో ప్రాణాలతో బయటపడింది చిన్నారి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారిపై కుక్కల దాడి స్థానికంగా ఉన్నా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.


నయీంనగర్ లష్కర్ సింగారంలో..

అలాగే, ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నయీంనగర్ లష్కర్ సింగారంలో మరో చిన్నారిపై వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. రోడ్డుపై ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. స్థానికులు గమనించి ఆ కుక్కలను తరిమికొట్టడంతో ప్రాణాలతో చిన్నారి బయటపడింది. కుక్కల స్వైర విహారం చేస్తున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమకు వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. తక్షణమే వీధి కుక్కలని పట్టుకొని దూరంగా వదిలివేయాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు స్థానికులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది.. కవిత ఎమోషనల్

మెట్రో‌ఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 09:56 PM