Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..
ABN , Publish Date - Jun 21 , 2025 | 08:44 AM
హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరంగల్ సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు.

BRS MLA Padi Kaushik Reddy arrest: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వరంగల్ కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, కౌశిక్ సోదరుడు ప్రతీక్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయనను పరామర్శించేందుకు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాయర్ తో కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలాగే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి కూడా స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. దీంతో స్టేషన్ చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదెలా ఉంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను పోలీసు కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..
Read latest Telangana News And Telugu News