Srushti Test Tube Baby case: 'సృష్టి' కేసులో బిగ్ ట్విస్ట్.. IVF అవసరం లేకున్నా తప్పుదోవ..
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:58 PM
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ట్విస్ట్.. గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నా సోనియా దంపతులను తప్పుదోవ పట్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం. సరోగసి ద్వారానే బిడ్డను కనాలని డాక్టర్ నమ్రత ఒత్తిడి చేయడంతో చివరికి..

సికింద్రాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసులో ట్విస్ట్.. గర్భం దాల్చే సామర్థ్యం ఉన్నా సోనియా దంపతులను సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం తప్పుదోవ పట్టించింది. సరోగసి ద్వారానే బిడ్డను కనాలని డాక్టర్ నమ్రత ఒత్తిడి చేయడంతో చివరికి సోనియా దంపతులు అంగీకరించారు. సంతానం కావాలంటే మరో దారి లేదని వైద్యురాలు నమ్మించడమే కారణం. అనంతరం డాక్టర్ నమ్రత IVF ప్రొసీజర్ కోసం 30 లక్షలు డిమాండ్ చేయగా.. సోనియా దంపతులు విడతల వారిగా డబ్బులు చెల్లించారు.
2024 సెప్టెంబర్‌లో సోనియా దంపతుల నుంచి సృష్టి సిబ్బంది వీర్యం శాంపిల్స్ సేకరించారు. సెప్టెంబర్ 23 న మీ దగ్గర తీసుకున్న శాంపిల్స్ ను మరో మహిళకు ఎక్కించామని చెప్పారు. సరోగసి ద్వారా బిడ్డ జన్మిస్తుందని డాక్టర్ నమ్రత నమ్మబలికారు. సరోగసి సక్సస్ అయిందని డాక్టర్ సౌమ్య అనే వైద్యురాలు నిర్ధారించినట్లు బాధిత దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, బిడ్డ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేయడానికి వైద్యులు నిరాకరించారు. దీంతో అనుమానం వచ్చి ఢిల్లీలో DNA టెస్ట్ లు చేయించుకున్నారు సోనియా దంపతులు.
సోనియా దంపతులకు, బిడ్డకు DNA మ్యాచ్ కాలేదని ఢిల్లీలో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. సోనియా దంపతుల ద్వారా తీసుకున్న శాంపిల్స్‌కు, బిడ్డ శాంపిల్స్‌తో సరిపోలలేదని తేలింది. దీంతో సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ మా బిడ్డ కాదని.. వారిరువురూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రతను నిలదీశారు. సోనియా దంపతులు గొడవకు దిగడంతో విధిలేక ఎక్కడో తప్పు జరిగిందని డాక్టర్ నమ్రత ఒప్పేసుకుంది.
అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ నమ్రత సహా ఆరుగురు నిందితులన అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను జడ్జి ఎదుట హాజరుపరిచారు. మారేడుపల్లి కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈవార్తలు కూడా చదవండి..
'సృష్టి' కేసులో సంచలన విషయాలు.. ఏబీఎన్ చేతికి ఎఫ్ఐఆర్ కాపీ..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News