Srushti Test Tube Baby case: 'సృష్టి' కేసులో సంచలన విషయాలు.. ఏబీఎన్ చేతికి ఎఫ్ఐఆర్ కాపీ..
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:44 AM
ఐవీఎఫ్ మార్గంలో సంతానం పొందాలని ఆశించిన దంపతులను మోసం చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేసిన సంచలన విషయాలు ఏబీఎన్ చేతికొచ్చాయి.

సికింద్రాబాద్: ఐవీఎఫ్ మార్గంలో సంతానం పొందాలని ఆశించిన దంపతులను మోసం చేసిన కేసులో.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో డాక్టర్ నమ్రతతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. విజయవాడ సృష్టి బేబీ సూపర్‌వైజర్ కళ్యాణితో పాటు సికింద్రాబాద్ సృష్టి సెంటర్ నుంచి ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను గాంధీ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో నిందితుల్ని మారేడుపల్లి జడ్జి నివాసంలో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.
వెలుగులోకి సృష్టి అక్రమాలు..
రాజస్థాన్‌కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదు మేరకుఈనెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 61,316,318,335,336,340 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు నమోదు చేసిన సంచలన విషయాలు ఇప్పుడు ఏబీఎన్ చేతికొచ్చాయి. ఇందులోని వివరాల ప్రకారం, రాజస్థాన్ కు సోనియా దంపతులు ఆగస్టు 2024న డాక్టర్ నమ్రతాను సంప్రదించారు. తాము IVF పద్ధతి ద్వారా సంతానం పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, IVF ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30 లక్షలు డిమాండ్ చేసింది. 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో.. మిగిలిన 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు సోనియా దంపతులు అంగీకరించారు.
ప్రొసీజర్‌లో భాగంగా దంపతుల శాంపిల్ కలెక్షన్ కోసం డాక్టర్ నమ్రత విశాఖపట్నంలోని మరో బ్రాంచ్‌కు పంపించారు. కేవలం మెడికల్ టెస్టుల కోసమే రూ.66 వేల రూపాయలను తీసుకున్నట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 25న సరోగెట్ ఆరోగ్యకరమైన పిండాన్ని అమర్చినట్లు డాక్టర్ నమ్రత చెప్పినట్లు తెలిపారు. సెప్టెంబర్ 26, 27న రూ.5 లక్షల రూపాయలు చెల్లించారు. డిసెంబర్ 2024 నుంచి మే 2025 మధ్య అనేకసార్లు చెల్లింపులు చేశారు.
మే 23న తన భర్త విదేశాలకు వెళ్లడంతో డీఎన్ఏ సేకరించాలని బాధితురాలు అడగ్గా.. డాక్టర్ నమ్రత నిరాకరించింది.జూన్ 4న కళ్యాణి అనే మహిళ సరోగసీ జరిగినట్లు చెప్పిందని.. ఓ నవజాత శిశువును చూపించి మీ బిడ్డ అందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జూన్ 19న విషయాన్ని కనుక్కునేందుకు డాక్టర్ నమ్రతను కాల్ చేయగా ఆమె ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. దీంతో ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను సంప్రదించారు బాధిత దంపతులు. ముగ్గురు డీఎన్ఏ శాంపిల్స్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత తిరిగి డాక్టర్ నమ్రత ఆస్పత్రికి వెళ్లగా పొరపాటు జరిగినట్లు అంగీకరించిందని అన్నారు.
ఈవార్తలు కూడా చదవండి..
యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. చివరికి..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News