Major Fire Incident In Sangareddy: తెలంగాణలో భారీ అగ్నిప్రమాదం.. ఏమైందంటై..
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:22 PM
పఠాన్‌చెరు పారిశ్రామికవాడ రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.
సంగారెడ్డి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పఠాన్‌చెరు పారిశ్రామికవాడ రూప కెమికల్స్ పరిశ్రమ (Chemical Industry)లో ఇవాళ(ఆదివారం) భారీ అగ్నిప్రమాదం (Major Fire Incident) జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ఈ విషయంపై స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక అధికారులు చేరుకున్నారు.
మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అగ్నిమాపక అధికారులు అదుపుచేస్తున్నారు. స్థానికులని ఘటనా స్థలం నుంచి దూరంగా అధికారులు పంపించి వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేరని తెలుస్తోంది. అయితే ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి నయా ప్లాన్
కేసీఆర్ హయాంలో చెరువులు, నాళాల కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు: ఎంపీ చామల
Read Latest Telangana News And Telugu News