Son Attack On Mother: నారాయణపేటలో దారుణం.. తల్లిని నరికి చంపిన కొడుకు
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:22 PM
కొన్ని నెలలుగా తల్లి, కుమారుడికి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట: నవ మాసాలు మోసి, కనిపెంచిన తల్లిని కొడుకు పారతో నరికి బండరాయితో మోది చంపిన ఘటన కొత్తపల్లి మండలం గోకుల్ నగరంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే.. కొన్ని నెలలుగా తల్లి, కుమారుడికి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం
Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలే..!