Home » Mahabubnagar
పాలమూరు బిడ్డనైన తాను పదేండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.
నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ పులుల అభయారణ్యం లోని చెంచుపెంటలు, గ్రామాల తరలింపునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛంద పునరా వాసం కోరుకుంటున్న 1,088 కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఎన్టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ఆమోదం తెలిపింది.
పాలమూరు నగర ప్రజలను చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఒకే చిరుత కనిపించగా, ఆదివారం ఒకేసారి రెండు కనిపించడం.. అవి కూడా నివాస గృహాల సమీపంలోకి రావడంతో బెంబేలెత్తిపోతున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన వరద శనివారం నాటికి క్రమంగా తగ్గుముఖం పట్టింది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రవేశాలు పెంచాలని ఇంటర్ బోర్డు అధికారులు ప్రిన్సిపాళ్లను పదేపదే కోరుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
Crime News: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడు తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అందరినీ అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజేశ్వర్, ఐశ్వర్య పెళ్లికి ముందు నుంచే తేజేశ్వర్‌ను అంతమొందించాలని తిరుమలరావు పన్నాగం చేశారన్నారు.
Crime News: సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తేజేశ్వర్ హత్య కన్నా ముందు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు తన భార్యను హతమార్చేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు సోమవారం ఇన్‌ఫ్లోలు పెరిగాయి. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టులో రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరుగు ప్రయాణమైన యువకులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రా వెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
జూరాల ప్రాజెక్టు భారీగా వరద చేరడంతో ప్రాజెక్ట్ అధికారులు 10 గేట్లు ఎత్తి 66 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జాలర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.