Special train: గుత్తి మీదుగా కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:05 PM
ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.
గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప,

యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ(Kadapa, Yarraguntla, Guthi, Don, Kurnool City, Gadwal, Mahabubnagar, Kacheguda), కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముడ్‌ఖేడ్, నాందేడ్, పూర్ణా, హింగోళి డెక్కన్, వాసిం, అకోలా, మల్కాపూర్, భుసవల్, జల్‌గావ్, పల్డి, నాదుర్బార్, ఎడ్నా, సూరత్, భరుచ్, వడోదర, గోద్రా, రత్లం, జవోరా, మండ్‌సోర్, నీమచ్, ఛత్తీస్ఘర్, భిల్వారా, బిజయ్‌నగర్, నాసిరాబాద్, అజ్మీర్ స్టేషన్ల మీదుగా వెళ్తుందని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు
Read Latest Telangana News and National News