Share News

Leopard Attack: కుక్క అనుకుని చిరుతపై దాడి.. ముగ్గురికి గాయాలు..

ABN , Publish Date - Jul 27 , 2025 | 09:31 AM

మహబూబ్‌నగర్ జిల్లాలో మరోమారు చిరుతపులి హల్ చల్ చేసింది. తరచూ చిరుతపులులు గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గొర్రెల మందపై దాడి చేసేందుకు చిరుతపులి యత్నించింది.

Leopard Attack: కుక్క అనుకుని చిరుతపై దాడి.. ముగ్గురికి గాయాలు..
Leopard attack Mahabubnagar

మహబూబ్‌నగర్, అచ్చుతాపూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. తరచూ చిరుతపులులు గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కోయిలకొండ మండలంలోని అచ్చుతాపూర్ గ్రామంలో చిరుతపులి దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. రాత్రి సమయంలో గొర్రెల మందపై దాడి చేసేందుకు మాటు వేసిన చిరుతను కుక్క అనుకుని భ్రమపడ్డారు గొర్రెల కాపర్లు. జీవాలను ఏం చేస్తుందోననే ఆందోళనతో చిరుతను ఎదురించేందుకు యత్నించారు.


గొర్రెల కాపర్లు మూకుమ్మడిగా దాడి చేసేందుకు మీదకి రావడంతో చిరుతపులి ప్రతిదాడి చేసేందుకు మీదకు ఉరికింది. అది కుక్క కాదు.. చిరుత అని తెలిసి గొర్రెల కాపర్లు ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. దీంతో చిరుతను సరిగా ఎదుర్కొలేక గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ముగ్గురు గొర్రెల కాపర్లను చికిత్స కోసం జనరల్ ఆసుపత్రికి తరలించారు.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 10:47 AM