Podu Farmers Attack On Forest Staff: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:04 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతులు ఇవాళ(శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామం అటవీ ప్రాంతంలో వలస ఆదివాసీ పోడు రైతులు దాడి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Bhadradri Kothagudem District) ఫారెస్ట్ సిబ్బంది (Forest Staff)పై ఆదివాసీ పోడు రైతులు (Podu Farmers) ఇవాళ(శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామం అటవీ ప్రాంతంలో దాడి చేశారు వలస ఆదివాసీ పోడు రైతులు. పోడు భూమిలో ఆదివాసీ గిరిజనులు హార్వేస్టర్ మిషన్ ద్వారా వరి పంట కోస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులపై ఆగ్రహంతో వలస ఆదివాసీ గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు గోవింద్, కోటేష్‌కి గాయాలయ్యాయి. గాయాలైన అధికారులకి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఆదివాసీ పోడు రైతులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ అధికారులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఆదివాసీ పోడు రైతులని పోలీసులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Read Latest Telangana News And Telugu News