Minister Thummala: మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jul 21 , 2025 | 09:23 PM
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్‌ని ఈనెల 24వ తేదీన నిర్వహించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రఘునాధపాలెం మండలంలోని చెరువులన్నిటిని నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో మాట్లాడి తక్షణమే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని సూచించారు.

ఖమ్మం జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించారు. ఇవాళ(సోమవారం) ఖమ్మం కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులపై జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్‌తో (Manchukonda Lift irrigation) పాటు ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ట్రయిల్ రన్‌ని ఈనెల 24వ తేదీన నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రఘునాధపాలెం మండలంలోని చెరువులన్నిటిని నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో మాట్లాడి తక్షణమే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై కోడుమూరు గ్రామం వద్ద ఉన్న హై టెన్షన్ లైన్‌ను తక్షణమే మార్చేలా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో డైరెక్టర్ లతా వినోదకు సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
నేషనల్ హైవే, ట్రాన్స్ కో అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కోడుమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి వెలుగుమట్ల అర్బన్ పార్క్ వరకు పైప్‌లైన్లు వేసి పార్క్ అసరాలకు నీరు అందించాలని ఇరిగేషన్, డీఎఫ్ఓ సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగర సుందరీకరణ కోసం అవసరం ఉన్న చోట రహదారుల విస్తరణ చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌తో పాటు రహదారుల విస్తరణలో ఇల్లు కోల్పోతున్న వారికి ఇళ్లస్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మించి ఇవ్వాలని సూచించారు. పేదలు ఎవరూ నష్టపోకుండా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.