Former Naxalite incident: మాజీ నక్సలైట్ దారుణ హత్య..
ABN , Publish Date - Nov 28 , 2025 | 08:07 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజన్న సిరిసిల్ల, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District) అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్య ఘటన (Former Naxalite incident) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ నక్సలైట్‌ని తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సిద్దయ్య ఆలియాస్ నర్సయ్య (50)గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సిద్దయ్యను బండరాళ్లతో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు సంతోశ్ అనే వ్యక్తి. గతంలో నక్సల్స్ ఉద్యమంలో పని చేసి, లొంగిపోయాడు సిద్దయ్య. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ ఉందని సిద్దయ్యను పిలిచాడని... ఓ ప్లాన్ ప్రకారమే సంతోశ్ హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. హత్య చేసిన అనంతరం జగిత్యాల పోలీసు స్టేషన్‌లో నిందితుడు సంతోశ్ లొంగిపోయినట్లు సమాచారం.
నిందితుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అసలు సిద్దయ్యను హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సిద్దయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సిద్దయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గండిలచ్చపేట గ్రామస్తులు సిద్దయ్య కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News