Share News

Tragedy in Jagitial District: ప్రమాదమా .. హత్యా ..? చిన్నారి ఘటనపై పోలీసుల దర్యాప్తు

ABN , Publish Date - Jul 06 , 2025 | 01:37 PM

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌లో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం నుంచి ఐదు సంవత్సరాల చిన్నారి హితిక్ష కనిపించకుండా పోయింది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. కొంతసేపటికే అదే కాలనీలోనీ ఓ ఇంటి బాత్ రూంలో రక్తపు మడుగులో ఆ చిన్నారి పడి ఉంది.

Tragedy in Jagitial District: ప్రమాదమా .. హత్యా ..? చిన్నారి ఘటనపై పోలీసుల దర్యాప్తు
Tragedy in Jagitial District

జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌లో (Adarsha Nagar) దారుణం జరిగింది. నిన్న(శనివారం) సాయంత్రం నుంచి ఐదు సంవత్సరాల చిన్నారి హితిక్ష (Hithiksha) కనిపించకుండా పోయింది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. కొంతసేపటికే అదే కాలనీలోనీ ఓ ఇంటి బాత్ రూంలో రక్తపు మడుగులో ఆ చిన్నారి పడి ఉంది. చిన్నారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పాప గొంతు కోసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకుని జగిత్యాల పోలీసులు విచారిస్తున్నారు.


దర్యాప్తు ముమ్మరం..

అయితే.. ఐదేళ్ల చిన్నారి హితిక్ష మృతిపై జగిత్యాల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నారు. చిన్నారి చనిపోయిన బాత్ రూం పరిసరాలను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. చిన్నారిది హత్యనా లేదా ఏదైనా ప్రమాద ఘటననా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి ఓనర్ ఫోన్, లొకేషన్‌ని పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. చిన్నారి భయపడి బాత్ రూం లోపలికి వెళ్లే సమయంలో జారీ వాటర్ ట్యాప్‌పై పడిందా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


పోలీసుల అదుపులో హితిక్ష పిన్ని

చిన్నారి హితిక్ష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హితిక్ష పిన్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల హితిక్ష తల్లికి, పిన్ని మమతకు మధ్య మనస్పర్థలు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. సీసీ టీవీ పుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుబాయ్‌లో హితిక్ష తండ్రి ఉన్నారు. చిన్నారి మృతి వార్త తెలియగానే హుటాహుటినా కోరుట్లకి ప్రయాణమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

డిజిటల్‌ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ

Read Latest Telangana News And Telugu News


వీడియో మీకోసం..

Updated Date - Jul 06 , 2025 | 01:49 PM