JP Nadda: యూరియాపై సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి.. స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా
ABN , Publish Date - Jul 09 , 2025 | 02:47 PM
ఖరీఫ్ సీజన్‌లో తమ రాష్ట్రంలో యూరియాకు గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రి జేపీ నడ్డాకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్‌లో సరిపడా ఎరువులు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.

ఢిల్లీ: ఖరీఫ్ సీజన్‌లో తమ రాష్ట్రంలో యూరియాకు గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రి జేపీ నడ్డాకి (Union Minister JP Nadda) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్‌లో సరిపడా యూరియా తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. అయితే సీఎం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేంద్రమంత్రి జేపీ నడ్డా.
అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు. ఇవాళ (బుధవారం) ఢిల్లీలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. రసాయన ఎరువులు అధికంగా వాడటంతో భూమిలోని సారం తగ్గిపోతోందని ముఖ్యమంత్రికి కేంద్రమంత్రి జేపీ నడ్డా సూచించారు. 2023-24 రబీతో పోలిస్తే 2024- 25లో 21శాతం అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్రమంత్రి వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటివరకు 12.4శాతం అదనపు వినియోగం జరిగిందని చెప్పుకొచ్చారు.
వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఎరువులు, సేంద్రీయ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి PM PRANAM పథకం గురించి తెలంగాణ అధికారులకు కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రంజిత్ కుమార్ మిశ్రా వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
లెవల్ క్రాసింగ్ గేట్లపై దృష్టి కేంద్రీకరించాలి
Read Latest Telangana News And Telugu News