TG News: మేడ్చల్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడో తెలుసా..
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:24 AM
మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్మికనగర్‌లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో రాడ్డుతో కొట్టి భర్త అశోక్ చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అశోక్‌పై గతంలో ఫోక్సో కేసు నమోదవడంతో భర్తకు దూరంగా భార్య సౌందర్య ఉంటోంది.

మేడ్చల్ జిల్లా: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్యపై అనుమానం పెనుభూతంగా మారి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలోని (Medchal District) జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్మికనగర్‌లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానమే పెనుభూతమై కోపం పెంచుకున్న భర్త... పని ముగించుకొని ఇంటికి భార్య వెళ్తుండగా దారికాచి రాడ్డుతో తలపై కొట్టడంతో తీవ్రగాయాలపాలై భార్య అక్కడిక్కడే మృతి చెందిన ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మికనగర్‌లో చోటుచేసుకుంది.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ కార్మికనగర్‌లో తమ్మిడి అశోక్(36), సౌందర్య (సోని) (32), కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తుండేవారు. అశోక్‌పై గతంలో ఫోక్సో కేసు నమోదవ్వగా కుటుంబంతో కలిసి ఉండటం లేదు. భార్య సౌందర్య ఇళ్లల్లో పారిశుద్ధ్య పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తాగుడుకు బానిసైన భర్త అశోక్ నిత్యం సౌందర్యను వేధిస్తున్నాడు.
మంగళవారం దమ్మాయిగూడలోని ఇళ్లల్లో పని చేసుకుని కార్మికనగర్‌లోని ఇంటికి సౌందర్య వెళ్తుండగా అశోక్ కృపాసన చర్చి సమీపంలో దారికాచి ఆమెపై బలమైన రాడ్డుతో తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు సౌందర్యని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందిందని డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సౌందర్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ సంఘటన కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులందరినీ తీవ్రంగా కలచివేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ హాట్ కామెంట్స్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
For More Telangana News and Telugu News..