Share News

TPCC District Incharges: ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన టీపీసీసీ చీఫ్

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:00 PM

TPCC District Incharges: పది ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్‌లతో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విధివిధానాలను మీనాక్షి వెల్లడించారు.

TPCC District Incharges: ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన టీపీసీసీ చీఫ్
TPCC District Incharges

హైదరాబాద్, జులై 7: సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇంఛార్జ్‌లను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) నియమించారు. ఈరోజు (సోమవారం) జిల్లా ఇంఛార్జ్‌లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ (AICC Incharge Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, 10 ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి విధానాలను మీనాక్షి వెల్లడించారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం ఉంటుందని చెప్పారు. వెంటనే రంగంలోకి దిగాలని ఏఐసీసీ ఇంఛార్జ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను టీపీసీసీ చీఫ్ నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్‌లను టీపీసీసీ చీఫ్ ప్రకటించారు.


ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్‌లు వీరే

1. వంశీచంద్ రెడ్డి - ఖమ్మం

2. ⁠సంపత్ కుమార్ - నల్లగొండ

3. అడ్లూరి లక్ష్మణ్ - వరంగల్

4. ⁠పొన్నం ప్రభాకర్ - మెదక్

5. జగ్గారెడ్డి - హైదరాబాద్

6. కుసుమ కుమార్ - మహబూబ్‌నగర్

7. అనీల్ యాదవ్ - ఆదిలాబాద్

8. అద్దంకి దయాకర్ - కరీంనగర్

9. అజ్మతుల్లా హుస్సేన్ - నిజామాబాద్

⁠10. శివసేన రెడ్డి - రంగారెడ్డి


ఇవి కూడా చదవండి

రోజులు గడుస్తున్నా లభించని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ

వారిపై దాడి చేశారో ఖబడ్దార్.. బీఆర్‌ఎస్‌కు రామచందర్ రావు వార్నింగ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 04:38 PM