Minister Damodar: ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మెడిసిన్స్ సిద్ధంగా ఉంచుకోవాలి
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:09 PM
కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ త్వరగా కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు.

హైదరాబాద్: కొత్త టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ త్వరగా కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ (Minister Damodar Rajanarasimha) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ సచివాలయంలో వైద్యశాఖ అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు.
డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫర్నీచర్ కొనుగోలు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ నిర్దేశించారు. కొత్త హాస్పిటళ్లకు పేషెంట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, ఆ అంచనాలకు తగ్గట్లుగా ఫర్నీచర్, ఎక్విప్‌మెంట్ సరిపడా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడిసిన్ సరఫరాపై వివిధ విభాగాల హెచ్‌వోడీలని అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా? లేవా అని డీఎంఈ, వీవీపీ కమిషనర్, డీహెచ్‌ను అడిగారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో కనీసం మూడు నెలలకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులకు సూచించారు మంత్రి దామోదర రాజనరసింహ.
ఆయా ఆస్పత్రుల్లో ఉన్న ప్లేట్‌లెట్ సపరేషన్ మిషన్లు మంచిగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. టీ డయాగ్నస్టిక్స్ హబ్స్‌లో అన్నిరకాల టెస్టులు, స్కాన్లు చేయాలని మంత్రి నిర్దేశించారు. ఒక్క టెస్టు కోసం కూడా పేషెంట్‌ను బయటకు పంపించొద్దని, ప్రతి పీహెచ్‌సీలోనూ టెస్టులు అవసరమైన పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించాలని, 24 గంటల్లోగా రిపోర్టులు అందజేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గతేడాది కొత్తగా ప్రతి జిల్లాలోనూ మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, ఆయా స్టోర్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లోనూ బిల్డింగుల నిర్మాణాన్ని ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మెడికల్ కాలేజీలు అన్నింటిలోనూ సీటీ స్కాన్ మిషన్లను అందుబాటులోకి తీసుకువచ్చామని, అలాగే అవసరమైన చోట ఎంఆర్‌ఐ యంత్రాల ఏర్పాటుకు తమ ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి స్పష్టం చేశారు. ఎంఆర్‌ఐ మిషన్ల కొనుగోలు, ఇన్‌స్టాలేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వరంగల్ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. విద్యార్థి సంఘాల నేతల అరెస్టుతో ఉద్రిక్తత
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Read Latest Telangana News And Telugu News